Retired IAS Somesh Kumar: సీఎం సీఆర్ ప్రధాన సలహాదారుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సోమేశ్‌కుమార్ నియామకం, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
మూడేళ్ల పాటు ఆయన పదవిలో కొనసాగనున్నారు.ప్రధాన సలహాదారుడిగా ఆయనకు ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన సలహాదారుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సోమేశ్‌కుమార్ నియామకమయ్యారు. మూడేళ్ల పాటు ఆయన పదవిలో కొనసాగనున్నారు.ప్రధాన సలహాదారుడిగా ఆయనకు ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించింది.
ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సోమేశ్‌కుమార్ 1989 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అనంతపురం కలెక్టర్ సహా వివిధ హోదాల్లో పని చేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా సేవలందించారు.
ఆ తర్వాత గిరిజన సంక్షేమ ప్రధాన కార్యదర్శిగా, 2016లో ఆబ్కారీ శాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేశారు. అనంతరం రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి పొందారు. 2019లో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియామకమయ్యారు. ఈ ఏడాది జనవరిలో హైకోర్టు ఏపీ కేడర్‌కు చెందిన అధికారిగా పేర్కొంటూ తీర్పు చెప్పింది. ఆ తర్వాత డీవోపీటీ ఏపీకి బదిలీ చేసింది. ఆ తర్వాత సోమేశ్‌కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నారు.