Conjunctivitis in Telangana: తెలంగాణలో పెరుగుతున్న కళ్ల కలక కేసులు.. ఆసుపత్రులకు క్యూ కడుతున్న బాధితులు

తెలంగాణలో కళ్ల కలక కేసులు పెరిగిపోతున్నాయి. హైదరాబాద్ లోని సరోజినీదేవీ కంటి ఆసుపత్రితో పాటు ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్ కు బాధితులు క్యూ కడుతున్నారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశాలోనూ కేసులు పెరుగుతున్నాయని ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి వైద్యులు చెప్పారు.

Conjunctivitis (Credits: Twitter)

Hyderabad, July 31: తెలంగాణలో (Telangana) కళ్ల కలక కేసులు (Conjunctivitis Cases) పెరిగిపోతున్నాయి. హైదరాబాద్ లోని (Hyderabad) సరోజినీదేవీ కంటి ఆసుపత్రితో పాటు ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్ కు బాధితులు క్యూ కడుతున్నారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశాలోనూ కేసులు పెరుగుతున్నాయని ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి వైద్యులు చెప్పారు. నెల రోజుల వ్యవధిలో ఈ మూడు రాష్ట్రాల్లో దాదాపు వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఒక్క సరోజనీదేవి ఆసుపత్రికే రోజుకు ముప్పై నలభై మంది బాధితులు వస్తున్నారని వైద్యులు చెప్పారు.

IIT Bombay: ఐఐటీ బాంబే క్యాంటీన్ లో పోస్టర్ల కలకలం.. శాకాహారం తినేవాళ్లే ఇక్కడ కూర్చోవాలంటూ వెలిసిన పోస్టర్లు

సూచనలు ఇవి

వర్షాకాలంలో వచ్చే వైరస్ ఇన్ ఫెక్షన్లలో కళ్ల కలక కూడా ఒకటని అన్నారు. వర్షాల వల్ల గాలిలో తేమ, చెమ్మ కారణంగా వైరస్ లు, ఫంగల్ ఇన్ ఫెక్షన్లు వ్యాపిస్తుంటాయని వివరించారు. వైరస్ వల్ల వచ్చే ఫోలిక్యులర్ కళ్ల కలకతో కంటి చూపునకు ప్రమాదం లేదని వైద్యులు చెప్పారు. బయట నుంచి వచ్చాక గోరువెచ్చని నీటితో కళ్లు, ముఖం కడుక్కోవాలని సూచించారు. కళ్ల కలక మరీ బాధిస్తుంటే అశ్రద్ధ చేయకుండా సంప్రదించాలని పేర్కొన్నారు.

Hyderabad Crime Case: హైదరాబాద్‌ లో సాఫ్ట్‌ వేర్ ఇంజినీర్ అనుమానాస్పద మృతి.. పాస్‌ పోర్టు కోసం నగరానికి వచ్చిన మణిరాజ్.. స్నేహితుడి ఇంటికి వెళ్లి బాత్రూంలో అనుమానాస్పద మృతి.. మృతుడు వరంగల్ వాసిగా గుర్తింపు

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement