Telangana Shocker: స్నేహితుల పార్టీ..బాగా తాగి బూతులు తిట్టిన ఓ స్నేహితుడు, తట్టుకోలేక చంపేసిన మరో స్నేహితుడు, హైదరాబాద్ నేరేడ్‌మెట్ ఠాణా పరిధిలో ఘటన, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
తన జోలికి వస్తే సహిస్తా కాని ఫ్యామిలీ జోలికి వస్తే సహించలేనంటూ స్నేహితుడు మరో స్నేహితునిపై సిమెంట్ ఇటుకతో దాడి చేసి చంపేశాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ నేరేడ్‌మెట్ ఠాణా (Hyderabad Neredmet) పరిధిలో చోటు చేసుకుంది.
Hyderabad, May 18: ఇద్దరి స్నేహితుల మధ్య గొడవ ఏకంగా ఓ స్నేహితుని ప్రాణాలను (Friend Assassinates His Friend) తీసింది. తన జోలికి వస్తే సహిస్తా కాని ఫ్యామిలీ జోలికి వస్తే సహించలేనంటూ స్నేహితుడు మరో స్నేహితునిపై సిమెంట్ ఇటుకతో దాడి చేసి చంపేశాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ నేరేడ్‌మెట్ ఠాణా (Hyderabad Neredmet) పరిధిలో చోటు చేసుకుంది.
నేరేడ్‌మెట్ ఇన్‌స్పెక్టర్ నర్సింహస్వామి వివరాల ప్రకారం.. ఈస్ట్ కృపా అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న ప్రెవేట్ ఉద్యోగి ఎం.శ్యాంసుందర్(31), చైనాబజార్ సమీపంలోని విజయ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న డ్రైవర్ పుల్గం నవీన్(33) రెండేళ్లుగా స్నేహితులు. ఇద్దరూ కలిసి అప్పుడప్పుడూ మద్యం తాగుతుంటారు. అలాగే నిన్న కూడా ఇద్దరూ మద్యం సేవించారు.బాగా తాగిన తరువాత శ్యాంసుందర్ నవీన్‌తో పాటు అతడి కుటుంబ సభ్యులను బూతులు (Scolding) తిట్టడం మొదలెట్టాడు. మద్యం తాగిన అనంతరం శ్యాంసుందర్ ఇంటికి వెళ్లిపోయాడు.
దీంతో నవీన్ అతడిపై కక్ష పెంచుకున్నాడు. కుటుంబ సభ్యులను తిట్టడాన్ని జీర్ణించుకోలేకపోయిన నవీన్ అతడి ఇంటికి వెళ్లి వాగ్వాదానికి దిగాడు. అనంతరం కర్రతో దాడి చేశాడు. శ్యాంసుందర్ తల్లి అడ్డుకునే ప్రయత్నం చేయగా, ఆమెను తోసేశాడు. పక్కనే ఉన్న సిమెంట్ ఇటుకతో శ్యాంసుందర్ తలపై బాది వెళ్లిపోయాడు. వెంటనే తల్లి 100కు డయల్ చేయగా నేరేడ్‌మెట్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.
అప్పటికే అతడు మృతి చెందాడని అంబులెన్స్ సిబ్బంది చెప్పారు. ఘటన స్థలాన్ని కుషాయిగూడ ఏసీపీ శివకుమార్, ఇన్‌స్పెక్టర్ నర్సింహస్వామి, క్రైం పార్టీ బృందాలు సందర్శించి ఆధారాలు సేకరించారు. నిందితుడు నవీన్‌ను అరెస్టు చేసినట్టు, మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఇన్‌స్పెక్టర్ వివరించారు