Meerut Twins Dies: కవలలను కాటేసిన కరోనా, ఇద్దరూ ఒక్కరోజే కన్నుమూత, శోక సంద్రంలో తల్లిదండ్రులు, ఎంతగా ప్రయత్నించినా కాపాడలేకపోయామని తెలిపిన వైద్యులు, మీరట్‌లో విషాద ఘటన
File image of LNJP Hospital in Delhi | (Photo Credits: PTI)

Meerut, May 18: కలిసి భూమి మీదకు వచ్చారు..కలిసి భూమిని విడిచి వెళ్లారు..ఇది ఇద్దరు కవలల కథ. మీరట్ కు చెందిన ఇద్దరు కవలలు కరోనాతో (Meerut Twins Dies) కన్నుమూశారు. విషాద ఘటన వివరాల్లోకెళితే.. మీరట్‌కు చెందిన గ్రెగరీ రైమండ్‌ రఫేల్‌ కు భార్య సోజా (Gregory Raymond Raphael, Soja) ఇద్దరు కవలలు, మరో కుమారుడు ఉన్నారు. కవల పిల్లలకు జోఫ్రెడ్‌ వాగెసే గ్రెగరీ, రాల్‌ఫ్రెడ్‌ వాగెసే గ్రెగరీ అని పేర్లు పెట్టుకున్నారు. మరో కుమారుడికి నెల్‌ఫ్రెడ్‌ అని పేరు పెట్టుకున్నారు.

వీరు కేరళ నుంచి ఉత్తరప్రదేశ్ చేరుకుని అక్కడ సెయింట్ థామస్ స్కూళ్లో టీచర్లుగా వర్క్ చేస్తున్నారు. కవల పిల్లలిద్దరూ (Ralfred, Joefred) ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లే. కోయంబత్తూరులోని కారుణ్య యూనివర్సిటీ నుంచి పట్టా పుచ్చుకున్నారు. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లలో భాగంగా జోఫ్రెడ్‌ అసెంచర్‌లో ఉద్యోగం సంపాదిస్తే.. రాల్‌ఫ్రెడ్‌ హుందాయ్‌ మ్యుబిస్‌ కంపెనీ(హైదరాబాద్‌ కార్యాలయం)లో ఉద్యోగానికి కుదిరాడు.ఆరు అడుగుల ఎత్తుతో, ఆకట్టుకునే రూపాలతో ఉండే ఈ కవలలను కరోనా (Meerut Twin Brothers Lose Battle To COVID-19) కాటేసింది. కలిసి పుట్టిన కవలలు కోవిడ్‌ బారిన పడి రోజు వ్యవధిలో (Die Hours Apart From Each Other) మరణించారు.

ఇద్దరూ వర్క్‌ ఫ్రం హోం ఆప్షన్‌ ఉండటంతో ఇంటికి వచ్చారు. ఏప్రిల్‌ 23న అన్నదమ్ములిద్దరికీ జ్వరం వచ్చింది. ఎందుకైనా మంచిదని వైద్యుల సలహాతో మెడికేషన్‌ ప్రారంభించారు. కానీ వారం రోజుల్లోనే పరిస్థితి దిగజారిపోయింది. మే 1 వాళ్లను స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. కోవిడ్‌ అని తేలింది. ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోవడంతో వెంటే వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స మొదలుపెట్టారు. కాస్త పరిస్థితి మెరుగుపడింది అనుకున్నారు.

సెకండ్ వేవ్ ముగిసినట్లేనా..దేశంలో తగ్గుతున్న కేసులు,పెరుగుతున్న డిశ్చార్జ్ రేటు, తాజాగా 4,22,436 మంది కోలుకుని డిశ్చార్జ్, నిన్న‌ కొత్త‌గా 2,63,533 మందికి కరోనా నిర్ధారణ, 4,329 మంది కోవిడ్ కారణంగా మృతి

అయితే పది రోజుల తర్వాత ఇద్దరికీ నెగటివ్‌ వచ్చింది. కానీ.. కానీ మూడు రోజుల్లోనే అంతా తలకిందులైంది. జాఫ్రెడ్‌ ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయాడు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు రాల్‌ఫ్రెడ్‌కు చెప్పలేదు. తనను చూసేందుకు మేం వెళ్లగానే.. ‘‘అమ్మా.. నువ్వేదో దాస్తున్నాం. ఏదో జరిగింది. నాకు చెప్పడం లేదు కదా. చెప్పమ్మా ప్లీజ్‌’’ అని వాళ్ల అమ్మను అడిగాడు.

24 గంటలు గడవకముందే తను కూడా కవల సోదరుడి దగ్గరకు వెళ్లిపోయాడు. మూడు నిమిషాల వ్యవధిలో పుట్టిన మా కవలలు, రోజు వ్యవధిలో శాశ్వతంగా మమ్మల్ని విడిచివెళ్లిపోయారు. నిజానికి తన ప్రియమైన సోదరుడు జాఫ్రెడ్‌ లేకుండా రాల్‌ఫ్రెడ్‌ ఒంటరిగా ఇంటికి రాడని నేను ముందే ఊహించాను’’అంటూ తండ్రి రేమండ్‌ కన్నీటి పర్యంతమయ్యారు.

ఐసీఎంఆర్‌ కీలక నిర్ణయం, కరోనా చికిత్సల జాబితా నుంచి ప్లాస్మా థెరపీ తొలగింపు, రెమ్‌డెసివిర్‌, టొసిలిజుమ్యాబ్‌లను మాత్రమే ఉపయోగించడానికి అనుమతి

టీచర్లమైన తాము ఎంతకష్టపడి పిల్లలను పెంచామో వాళ్లకు తెలుసునని, అందుకే తమకు అన్ని సంతోషాలు ఇవ్వాలని కొడుకులు ఎంతో శ్రమించేవారని, విదేశాల్లో స్థిరపడాలని కలలు కన్నారని గుర్తుచేసుకున్నారు. కానీ దేవుడు మాత్రం వాళ్లకు ఊహించని శిక్ష విధించాడంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఇప్పుడు రేమండ్‌ దంపతులకు మరో కుమారుడు నెల్‌ఫ్రెడ్‌ ఒక్కడే వారి బాధను కొంతనైనా తీర్చగలిగే ఆశాదీపం.

ఇద్దరూ ఎంతో ఫిట్‌గా ఆరు అడుగుల ఎత్తుతో బలంగా ఉన్నారు. కానీ కోవిడ్‌ వారిని బలితీసుకుంది. మేమెంతగా ప్రయత్నించినా ఆ కవలలను కాపాడలేకపోయాం అంటూ వారికి చికిత్స అందించిన వైద్యులు ఆవేదన వ్యక్తం చేశారు.