Hyderabad Shocker: హైదరాబాద్‌లో ఎంసీఏ విద్యార్థి ఆత్మహత్య, సూసైడ్ నోట్ రాసి ప్రైవేట్‌ హస్టల్‌లో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్న యువకుడు

ఐ మిస్‌ యూ నాన్న, మమ్మీ, అన్న, స్నేహతులు’ అని సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సరూర్‌నగర్‌ పోలీస్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది.

Suicide (Photo Credits: Twitter)

Hyd, April 27: ప్రైవేట్‌ హస్టల్‌లో ఉంటున్న ఎంసీఏ విద్యార్థి.. ఐ మిస్‌ యూ నాన్న, మమ్మీ, అన్న, స్నేహతులు’ అని సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సరూర్‌నగర్‌ పోలీస్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..నల్గొండ పట్టణానికి చెందిన జాలా లింగేశం, లక్ష్మమ్మ దంపతుల చిన్న కుమారుడు రినేష్‌(22) దిల్‌సుఖ్‌నగర్‌ మధురాపురి కాలనీలోని రాఘవేంద్ర బాలుర హాస్టల్‌లో ఉంటూ ఓ ప్రైవేట్‌ కళశాలలో ఎంసీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.

మంగళవారం మధ్యాహ్నం సమయంలో తోటి విద్యార్థి సాయి హాస్టల్‌ రూంకు వచ్చి చూడగా లోపలివైపు తలుపుకు గడియ పెట్టి ఉంది.సాయి తలుపులు ఎంత కొట్టినా తీయకపోవడంతో కిటికీలోంచి చూడగా రినేష్‌ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. వెంటనే సాయి హాస్టల్‌ నిర్వాహకుడు రమేష్‌కి సమాచారం ఇవ్వగా తలుపులు పగులకొట్టి లోనికి వెళ్లి రినేష్‌ను కిందకు దించారు.

విశాఖ బీచ్‌లో గర్భిణి మహిళ మృతి కేసులో పురోగతి, అత్తమామల వేధింపులతో ఆత్మహత్య చేసుకుందని నిర్థారించిన పోలీసులు

అనంతరం 108కు సమాచారం ఇవ్వగా...వారు వచ్చి పరీక్షించి రినేష్‌ అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. అనంతరం తండ్రి లింగేశంకు సమాచారం ఇచ్చారు. హాస్టల్‌ నిర్వాహకుడు రమేష్‌ ఇచ్చిన సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.నగరానికి చేరుకున్ను రినేష్‌ కుటుంబ సభ్యులు, బంధువులు హాస్టల్‌కు చేరుకుని..మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ హాస్టల్‌ ముందు ఆందోళనకు దిగారు. ఆందోళన చేస్తున్న వారికి పలు విద్యార్ది సంఘాలు మద్దతు తెలిపాయి.

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో దారుణం, ముగ్గురు చిన్నారులను బావిలో పడేసిన తల్లి, తను కూడా అదే బావిలో దూకి ఆత్మహత్య

తాము రాకముందే మృతదేహాన్ని ఎందుకు తరలించారని ప్రశ్నించారు. అనంతరం దిల్‌సుఖ్‌నగర్‌ రాజీవ్‌చౌక్‌ వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. కాగా గత 10 రోజులుగా రినేష్‌ డల్‌గా ఉంటున్నాడని, తనకు చదువు ఇష్టం లేదని తెలిపినట్లు తోటి విద్యార్థులు పోలీసులకు తెలిపారు. కాగా రినేష్‌ ఆత్మహత్యపై అన్ని కోణాల్లో విచారణ చేపడతామని ఎల్‌బీనగర్‌ ఏసీపీ శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈమేరకు రినేష్‌ తండ్రి లింగేశంకు హామీఇచ్చారు.