Telangana Horror: ఆస్తి అమ్మడానికి అడ్డుగా ఉందని తల్లిపై కొడుకు దారుణం, భార్యతో కలిసి అర్థరాత్రి గొంతుకి టవల్ చుట్టి హత్య, నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఈ హత్యకు భార్య, మరో వ్యక్తి సహకరించారు. హైదరాబాద్‌‌ ఉప్పల్‌‌లోని రామంతాపూర్‌‌‌‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

Representative Image (Photo Credits: IANS)

Hyd, Jan 8: ఆస్తి కోసం నవ మాసాలు మోసి కని పెంచిన కన్న తల్లిని దారుణంగా (Son kills mother with help of wife) చంపాడు ఓ కసాయి కొడుకు. ఈ హత్యకు భార్య, మరో వ్యక్తి సహకరించారు. హైదరాబాద్‌‌ ఉప్పల్‌‌లోని రామంతాపూర్‌‌‌‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామంతాపూర్‌‌‌‌లోని వెంకట్‌‌ రెడ్డి నగర్‌‌‌‌లో కాసవేని అనిల్‌‌ (40), అతని తల్లి సుగుణమ్మ, భార్య తిరుమల (35) నివాసం ఉంటున్నారు. అనిల్‌‌కు ఇద్దరు కొడుకులు కాగా, వారు హాస్టల్‌‌లో ఉంటూ చదువుకుంటున్నారు. అనిల్‌‌ జులాయిగా తిరుగుతుండేవాడు. ఈ క్రమంలో అతని భార్య తిరుమలకు వారి ఇంటి సమీపంలో ఉన్న శివ (35)తో పరిచయం ఏర్పడింది.

5 ఏళ్ల క్రితం ఇంటిని (property) తన పేరిట రాయాలని కోడలు తిరుమల ఒత్తిడి తేవడంతో చేసేదేమీ లేక సుగుణమ్మ ఇంటిని తిరుమల పేరిట రాసింది.గత కొంత కాలంగా ఆ ఇంటిని అమ్మడానికి ఆమె ప్రయత్నిస్తుండగా, ఈ విషయం సుగుణమ్మకు తెలిసింది. ఆ ఇల్లు తన భర్త జ్ఞాపకం అని, తాను బతికి ఉన్నంత కాలం ఇంటిని అమ్మడానికి వీల్లేదని తేల్చి చెప్పింది.

షాద్ నగర్‌లో దారుణం, కన్నతల్లిని కొట్టి చంపిన కొడుకు, అనారోగ్యంతో మృతి చెందిందని నమ్మించే ప్రయత్నం, కేసు నమోదు చేసిన పోలీసులు

ఇంటిని అమ్మడానికి సుగుణమ్మ ఒప్పుకోకపోవడంతో భార్య తిరుమల, స్నేహితుడు శివతో కలిసి కుమారుడు అనిలే కన్నతల్లిని కడతేర్చాడు. ఈ నెల 4వ తేదీన సుగుణమ్మ నిద్రిస్తున్న సమయంలో ముఖంపై దిండు పెట్టి, టవల్‌ గొంతుకి చుట్టి హత్య చేశారు. తరువాత విషయం తెలుసుకున్న సుగుణమ్మ తల్లి ఐలమ్మ, కుమార్తె అంత్యక్రియలకు వెంకట్‌రెడ్డి నగర్ చేరుకుంది.

తన కూతురిది సహజ మరణం కాదని, హత్య అని మృతురాలి తల్లి అనుమానం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో బంధువులు సుగుణమ్మ అంత్యక్రియలకు రాగా, ఆమె చెవుల నుంచి రక్తం కారిన గుర్తులు గమనించారు. సుగుణమ్మ తల్లి, బంధువులు అనిల్‌, తిరుమలను నిలదీయగా, తామే చంపామని నిజం ఒప్పుకున్నారు. ఇల్లు అమ్ముకునేందుకు అడ్డుగా ఉందనే కారణంతోనే ఇలా చేశామని చెప్పారు. బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న ఉప్పల్ పోలీసులు.. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif