Telangana: అన్న మరణం తట్టుకోలేక గుండెపోటుతో తమ్ముడి మృతి, మంచిర్యాల జిల్లాలో 3 గంటల వ్యవధిలో విషాద ఘటనలు, శోకసంద్రంలో మునిగిపోయిన కుటుంబ సభ్యులు
అయితే భాస్కర్ గౌడ్ గుండెపోటుతో మరణించాడు. అన్న మృతి చెందాడన్న వార్త శ్రీనివాస్ గౌడ్‌కు తెలిసింది. దీంతో హుటాహుటిన లక్సెట్టిపేటకు శ్రీనివాస్ గౌడ్ చేరుకుని అన్న మృతదేహాన్ని చూసి బోరున విలపించాడు. ఈ క్రమంలో శ్రీనివాస్ గౌడ్ కూడా గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు.
Mancherial, May 11: మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో విషాదం చోటు చేసుకుంది. అన్న గుండెపోటుతో మరణించడాన్ని భరించలేక తమ్ముడూ మృతి (Siblings die of heart stroke ) చెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కాగా ఇద్దరు అన్నదమ్ములు.. ఒకరంటే ఒకరికి ప్రాణంగా జీవించారు. ఏ ఒక్కరూ ఆపదలో ఉన్న ఒకరికొకరు సహాయం చేసుకునేవారు. ఇద్దరి కష్టాలు ఒకటేనని భావించి ముందుకు వెళ్ళే అన్నదమ్ములు ఒకేసారి అనంతలోకాలకు వెళ్లడం జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. అన్న మృతిని తట్టుకోలేని తమ్ముడు బోరున విలపిస్తూ గుండెపోటుకు గురయ్యాడు. అన్న మృతదేహం పక్కనే ప్రాణాలు విడిచాడు. తెలంగాణలో ఘోర విషాదం, కొడుకు దినకర్మకు వెళ్లి వస్తూ తల్లితో సహా 9 మంది మృత్యువాత, మరో 17 మందికి గాయాలు
విషాద ఘటన వివరాల్లోకెళితే.. లక్సెట్టిపేట పట్టణానికి చెందిన గాజుల భాస్కర్ గౌడ్(46), శ్రీనివాస్ గౌడ్ అన్నదమ్ములు. అయితే భాస్కర్ గౌడ్ గుండెపోటుతో మరణించాడు. అన్న మృతి చెందాడన్న వార్త శ్రీనివాస్ గౌడ్‌కు తెలిసింది. దీంతో హుటాహుటిన లక్సెట్టిపేటకు శ్రీనివాస్ గౌడ్ చేరుకుని అన్న మృతదేహాన్ని చూసి బోరున విలపించాడు. ఈ క్రమంలో శ్రీనివాస్ గౌడ్ కూడా గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. ఒకే ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు గంటల వ్యవధిలో (gap of three hours in Mancherial) గుండెపోటుతో మరణించడం తీవ్ర విషాదాన్ని నింపింది. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.