Manmohan Singh-Telangana: మన్మోహనుడి హయాంలోనే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు.. ఎంతమంది వ్యతిరేకించినప్పటికీ వెనక్కితగ్గని ధీశాలి

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకోసం అరవై ఏండ్లపాటు సుదీర్ఘ పోరాటం జరిగినప్పటికీ, అప్పటి ప్రధాని మన్మోహనుడి ప్రభుత్వంలోనే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు జరిగింది.

Manmohan-KCR (Credits: X)

Hyderabad, Dec 27: తెలంగాణ (Telangana) రాష్ట్ర ఏర్పాటుకోసం అరవై ఏండ్లపాటు సుదీర్ఘ పోరాటం జరిగినప్పటికీ, అప్పటి ప్రధాని మన్మోహనుడి (Manmohan Singh) ప్రభుత్వంలోనే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు జరిగింది. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను ఒకవిధంగా మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ నెరవేర్చారని రాజకీయ విశ్లేషకులు గుర్తుచేసుకుంటున్నారు. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ డిసెంబర్‌ 9 ప్రకటన వెలువడింది. తెలంగాణ ఏర్పాటును కాంగ్రెస్‌ పార్టీకి చెందిన అప్పటి సమైక్యవాదులు, నేతలు, ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకించారు. కేంద్ర కేబినెట్‌ లో ఉన్న ఆయా నేతలు రాజీనామా  చేస్తామని బెదిరించారు. అయినప్పటికీ మన్మోహన్‌ సింగ్‌ వెనక్కి తగ్గలేదు. తెలంగాణను ఏర్పాటు చేస్తూ ధీరోదాత్త ప్రకటన చేయించారు.

మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ మ‌ర‌ణం.. విద్యాసంస్థ‌లు, ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు నేడు సెల‌వు ప్ర‌క‌టించిన తెలంగాణ ప్ర‌భుత్వం.. వారం రోజుల‌పాటు రాష్ట్ర‌వ్యాప్తంగా సంతాప దినాలు

తెలంగాణ కోసం ప్రత్యేక సూచనలు

తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తామని యూపీఏ ప్రభుత్వం డిసెంబర్‌ 9న చేసిన ప్రకటనను త్రిమూర్తుల కూర్పుగా చెప్పుంటారు. ప్రకటన చేసింది నాటి హోంమంత్రి చిదంబరమే అయినా.. కేసీఆర్‌ కు, మన్మోహన్‌ సింగ్‌ కు మధ్య వారధిగా జయశంకర్‌ సార్‌ ఉన్నారు. పార్లమెంట్‌ లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు మద్దతు కూడగట్టడంలో కేసీఆర్‌ కు మన్మోహన్‌ సింగ్‌ తగిన సూచనలు చేసినట్టు చెప్తారు. అలా తెలంగాణ సాకారమైంది.

మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూత‌, ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మ‌ర‌ణించిన రాజ‌కీయ దురంధ‌రుడు

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Group-2 Results Today: నేడు గ్రూప్‌-2 ఫలితాలు.. జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల పరీక్ష ఫలితాలు

Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

Advertisement
Advertisement
Share Now
Advertisement