Research on Tomato: టమాటోపై పరిశోధనకు కేంద్రం నుంచి రూ. 6.18 కోట్ల నిధులు, నాలుగేండ్ల పాటు పరిశోధనలు చేయనున్న హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్లు

ది రెపోజిటరీ ఆఫ్‌ టొమాటో జీనోమిక్స్‌ రిసోర్సెస్‌(ఆర్టీజీఆర్‌)లో టమాటో జన్యు, జీవక్రియ, ప్రొటీన్‌కు సంబంధించిన అంశాలపై ఈ యూనివర్సిటీలో పరిశోధనలు చేపట్టారు.

Eat tomatoes to fight liver cancer, inflammation (Photo Credits: Pixabay)

Hyd, Nov 23: తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో గచ్చిబౌలిలోని హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో టమాటోపై పరిశోధనకు కేంద్ర ప్రభుత్వం రూ.6.18 కోట్లు మంజూరు చేసింది. ది రెపోజిటరీ ఆఫ్‌ టొమాటో జీనోమిక్స్‌ రిసోర్సెస్‌(ఆర్టీజీఆర్‌)లో టమాటో జన్యు, జీవక్రియ, ప్రొటీన్‌కు సంబంధించిన అంశాలపై ఈ యూనివర్సిటీలో పరిశోధనలు చేపట్టారు. వీటి పరిశోధన మరింత మెరుగ్గా సాగేందుకు కేంద్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, కేంద్ర జీవసాంకేతిక విజ్ఞానశాఖ యూనివర్సిటీకి రూ. 6 కోట్ల నిధులను (Rs 6-crore funding for research on tomato) విడుదల చేశాయి.

నాలుగేండ్ల పాటు సాగే ఈ పరిశోధనల కోసం నిధులను కేంద్రం మంజూరు చేసిందని యూనివర్సిటీ యాజమాన్యం తెలిపింది. టమాటోలో పోషకాలు పెంచి, ఎక్కువ కాలం నిల్వ ఉంచే పరిశోధనలు చేస్తున్నట్టు యాజమాన్యం వివరించింది. ఈ ప్రాజెక్ట్‌కు ‘రిసెర్చ్‌ అండ్‌ సర్వీస్‌ ఫెసిలిటీస్‌ ఫర్‌ ప్లాంట్‌ మెటాబోలోమిక్స్‌ అండ్‌ ప్రోటీమిక్స్‌’గా నామకరణం చేసినట్టు వెల్లడించింది. ఆర్టీజీఆర్‌లో ప్రొఫెసర్‌ ఆర్‌పీ శర్మ, డాక్టర్‌ వై శ్రీలక్ష్మీ కోఆర్డినేటర్లుగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నది.

తెలంగాణలో ఇంటర్ స్పెషల్‌ ఎగ్జామ్స్‌ ఉండవు, వార్షిక పరీక్షలప్పుడే విద్యార్థులందరికీ పరీక్షలను నిర్వహిస్తామని తెలిపిన ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌

యూనివర్సిటీ వద్ద ఉన్న రిపోజిటరీ ఆఫ్ టొమాటో జెనోమిక్స్ రిసోర్సెస్ (RTGR) 2010లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ నిధులతో స్థాపించబడింది. ఇది ప్రోటీమిక్స్ మరియు మెటబోలోమిక్స్‌లో అత్యాధునిక పరిశోధనలను నిర్వహించడానికి అధునాతన సాధనాలను కలిగి ఉంది.