Honour Killing in Telangana: లేడీ కానిస్టేబుల్ దారుణ హత్య, మృతురాలు నాగమణి భర్త పోలీసులకు ఫిర్యాదు చేసిన కాపీ వెలుగులోకి, పరువు హత్యతో పాటు ఆస్తి కోసం..
హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నాగమణిని సొంత తమ్ముడే హత్య చేశాడు. ఇది పరువు హత్యతో పాటుగా, ఆస్తి గొడవలే హత్యకు కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తెలుస్తోంది.
ఇబ్రహీంపట్నంలో లేడీ కానిస్టేబుల్ హత్య సంచలనం రేపిన సంగతి విదితమే. హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నాగమణిని సొంత తమ్ముడే హత్య చేశాడు. ఇది పరువు హత్యతో పాటుగా, ఆస్తి గొడవలే హత్యకు కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తెలుస్తోంది.దీనికి సంబంధించి మృతి చెందిన మహిళ భర్త పోలీసులకు ఫిర్యాదు చేసిన కాపీ వెలుగులోకి వచ్చింది.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో మహిళా కానిస్టేబుల్ దారుణ హత్య
రాయపోల్‌కు చెందిన శ్రీకాంత్,నాగమణిలు నవంబర్ ఒకటో తేదీన యాదగిరిగుట్టలో ప్రేమ వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం హయత్‌నగర్‌లో నాగమణి, శ్రీకాంత్ నివాసం ఉంటున్నారు. నిన్న సెలవు కావడంతో నాగమణి తన సొంత గ్రామానికి వెళ్ళింది. నాగమణి స్కూటీపై డ్యూటీకి వెళుతుండగా వెంబడించిన తమ్ముడు పరమేష్ తొలుత ఆమెను కారుతో ఢీకొట్టి అనంతరం కొడవలితో మెడ నరికి చంపాడు.హత్య చేసిన పరమేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Telangana woman constable killed by brother
ఆస్తి కోసమే అక్క నాగమణిని తమ్ముడు పరమేష్ చంపినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. నాగమణికి తల్లిదండ్రులు లేకపోవడంతో అన్నీ తానే చూసుకున్నాడు పరమేష్. కాగా నాగమణికి ఇదివరకే వివాహమై విడాకులు కూడా అయ్యాయి. తమ వారసత్వ భూమిని మొదటి వివాహం తర్వాత నాగమణి తమ్ముడికి ఇచ్చేసింది. అయితే ఈ భూమి విషయంలోనే హత్య జరిగినట్లు తెలుస్తోంది.