Telangana: పోలీస్ ఉద్యోగం కోసం ఓ యువతి అతి తెలివి, తలపై M-సీల్ మైనపు ముక్కను అతికించుకుని శారీరక దారుఢ్య పరీక్షకు హాజరు, షాకయిన తెలంగాణ పోలీసులు
రాష్ట్ర పోలీస్‌లో ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో, మహబూబ్‌నగర్‌లో బుధవారం కొనసాగుతున్న పోలీసు కానిస్టేబుల్, సబ్-ఇన్‌స్పెక్టర్ శారీరక దారుఢ్య పరీక్షల (police recruitment) సందర్భంగా ఒక మహిళా అభ్యర్థి జుట్టులో M-సీల్ మైనపు ముక్కను (Woman tries to increase height with M-Seal) అతికించి తన ఎత్తును పెంచుకోవడానికి ప్రయత్నించారు.
Hyd, Dec 16: రాష్ట్ర పోలీస్‌లో ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో, మహబూబ్‌నగర్‌లో బుధవారం కొనసాగుతున్న పోలీసు కానిస్టేబుల్, సబ్-ఇన్‌స్పెక్టర్ శారీరక దారుఢ్య పరీక్షల (police recruitment) సందర్భంగా ఒక మహిళా అభ్యర్థి జుట్టులో M-సీల్ మైనపు ముక్కను (Woman tries to increase height with M-Seal) అతికించి తన ఎత్తును పెంచుకోవడానికి ప్రయత్నించారు. ఆమెను పట్టుకున్న అధికారులు మోసం చేశారనే ఆరోపణలపై అనర్హత వేటు వేశారు.
మహబూబ్ నగర్ ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. ఎలక్ట్రానిక్ ఎత్తు కొలిచే పరికరంపై మహిళ నిల్చున్న వెంటనే ఎలక్ట్రానిక్ పరికరంలోని సెన్సార్ స్పందించలేదు. పరికరం యొక్క ప్రతిస్పందనతో ఆశ్చర్యపోయిన అధికారులు..ఆమెను పరీక్షించగా.. ఎత్తు పెరగడానికి ఆమె తన వెంట్రుకల క్రింద M-సీల్ మైనపును అతికించినట్లు గుర్తించినట్లు ఎస్పీ తెలిపారు.
ఎలక్ట్రానిక్ ఎత్తును కొలిచే పరికరంపై అభ్యర్థి నిలబడితే, సెన్సార్లు స్పందించి, తలపై, పాదాల క్రింద పర్ఫెక్ట్ టచ్ ఉన్నప్పుడే ఎత్తు, బరువును సూచిస్తాయని, అందువల్ల, తప్పుగా ఉండే అవకాశం చాలా తక్కువగా ఉందని ఆయన అన్నారు. ఎలక్ట్రానిక్ పరికరం కారణంగా మహిళ పట్టుబడిందని, లేకపోతే ఆమె తన ప్రయత్నాలలో విజయం సాధించి ఉండేదని ఆయన తెలిపారు.
మహిళను వెంటనే సీనియర్ అధికారుల ముందు హాజరుపరిచారు, వారు ఎస్పీని సంప్రదించిన తర్వాత ఆమెపై అనర్హత వేటు వేశారు. భౌతిక కొలతలు, ఖచ్చితత్వం కోసం వివిధ పరీక్షలను తనిఖీ చేయడానికి అధునాతన పరికరాలను ఉపయోగిస్తున్నామని, తద్వారా నిజమైన అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు.