Telugu States CM’s Meeting: ముగిసిన తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల భేటీ, గంటా 45 నిమిషాల పాటూ సాగిన చ‌ర్చ‌లో ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చిన అంశాలివే!

గంటా 45 నిమిషాల పాటు సమావేశం జరిగింది. మరోసారి సీఏస్‌ల స్థాయిలో సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారానికి రెండు కమిటీలు వేయాలని నిర్ణయించారు.

Telugu States CM’s Meeting

Hyderabad, July 06: హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో (Praja bhavan) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), రేవంత్ రెడ్డి (Revanth Reddy)సమావేశమై చర్చించారు. గంటా 45 నిమిషాల పాటు సమావేశం జరిగింది. మరోసారి సీఏస్‌ల స్థాయిలో సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారానికి రెండు కమిటీలు వేయాలని నిర్ణయించారు. హైదరాబాద్‌లోని ఆస్తులన్నీ తెలంగాణకే చెందుతాయని చంద్రబాబుకి రేవంత్ రెడ్డి స్పష్టం చేసినట్లు తెలిసింది.

 

రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, మరో ఇద్దరు అధికారులు ఇందులో పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడితో పాటు మంత్రులు కందుల దుర్గేశ్, సత్య ప్రసాద్, బీసీ జనార్దన్ ఉన్నారు. అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్, అధికారులు కార్తికేయ మిశ్రా, రవిచంద్ర ఉన్నారు.

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించిన ప్ర‌ధాన అంశాలు: