Tension at Assembly Gate: అసెంబ్లీ గేటు వద్ద ఉద్రిక్తత.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్న పోలీసులు.. కారణం ఇదే..! (వీడియో)
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను భద్రతా సిబ్బంది అసెంబ్లీ గేటు దగ్గర అడ్డుకున్నారు.
Hyderabad, Dec 9: తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో (Assembly Session) ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బీఆర్‌ఎస్ (BRS) ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను భద్రతా సిబ్బంది అసెంబ్లీ గేటు దగ్గర అడ్డుకున్నారు. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీ ప్రజాప్రతినిధులు నినాదాలు చేస్తున్నారు. తమను ఎందుకు అడ్డుకుంటున్నారని కేటీఆర్ వారిని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో భద్రతా సిబ్బందికి, బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. ఎమ్మెల్యేల్లో కొందరిని పోలీసులు అరెస్టు చేశారు.
అభ్యంతరం ఎందుకంటే?
కేటీఆర్, హరీశ్ రావు సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అదానీ, రేవంత్ రెడ్డి ఫొటోతో కూడిన టీ షార్ట్స్ ధరించడం పట్ల భద్రతా సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే వాళ్ళను అడ్డుకున్నారు. అదానీ, రేవంత్ దోస్తానాపై బీఆర్ఎస్ నేతలు నిరసన తెలుపుతున్నారు. రేవంత్ అదానీ భాయి భాయి అంటూ నినాదాలు చేస్తున్నారు. ఢిల్లీలో కుస్తీ.. గల్లీలో దోస్తీ, తెలంగాణ తల్లి మాది.. కాంగ్రెస్ తల్లి నీది, బతుకమ్మను తీసి చేయి గుర్తు పెట్టిందంటూ పెద్దపెట్టున నినాదాలు చేస్తున్నారు.