TG to Replace TS: కొత్తగా రిజిస్ట్రేషన్‌ అయ్యే వాహనాలకు మాత్రమే టీఎస్ to టీజీ వర్తిస్తుందా ! అధికారిక సమాచారం వచ్చేవరకు వేచి ఉండాలని వాహనదారులకు అధికారులు సూచన

అధికారిక లోగో, తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్చాలని తీర్మానించింది. వాహనాల రిజిస్ట్రేషన్‌ను ఇకపై టీఎస్‌ నుంచి టీజీగా (TG to Replace TS) మార్చేందుకు చట్టం చేయనున్నది

Chief Minister A. Revanth Reddy (Photo Credits: X/@INCTelangana)

Hyd, Feb 5: తెలంగాణ అధికారిక చిహ్నాలను, గుర్తింపును మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అధికారిక లోగో, తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్చాలని తీర్మానించింది. వాహనాల రిజిస్ట్రేషన్‌ను ఇకపై టీఎస్‌ నుంచి టీజీగా (TG to Replace TS) మార్చేందుకు చట్టం చేయనున్నది. ప్రస్తుతం వాహనాల నంబర్లకు ఉన్న టీఎస్‌ను టీజీగా మార్చుతూ నిన్న కేబినెట్ నిర్ణయం (Revanth Reddy Cabinet Approves) తీసుకున్న విషయం తెలిసిందే.

ఇందుకు సంబంధించిన ఫైలును రేపు కేంద్ర రవాణాశాఖకు పంపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. కేంద్ర రవాణాశాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి వారం రోజులు,  అక్కడి నుంచి గెజిట్ వచ్చాక రెండు రోజుల తర్వాత నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. కాబట్టి వెహికిల్ నంబర్లపై రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం అమల్లోకి రావడానికి ఇంకా 15 రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు సమాాచారం. ఈ ప్రాసెస్ అయిన తర్వాతే ఆర్టీఏ కార్యాలయాలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. అప్పటి నుంచి టీజీ అనేది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.

 తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతంగా జయ జయహే తెలంగాణ, ఈనెల 8 నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు, తెలంగాణ కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు ఇవిగో..

తెలంగాణ ఏర్పడిన తర్వాత రిజిస్ట్రేషన్ అయిన వాహనాలకు టీఎస్ గా ఎలా చేశారో.. ప్రస్తుతం కేంద్ర రవాణాశాఖ గెజిట్ తర్వాత.. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఆ తర్వాత కొత్తగా రిజిస్ట్రేషన్ అయ్యే వెహికిల్స్ కు మాత్రమే టీజీ పేరుతో నంబర్లను కేటాయిస్తారని సమాచారం. ఇప్పటి వరకు టీఎస్‌ (TS) నంబర్‌ ప్లేట్లను మార్చుకోవాల్సిన అవసరం లేదని , ప్రభుత్వ జీవో వచ్చిన తరువాత అప్పటి నుంచి కొత్తగా రిజిస్ట్రేషన్‌ (New Registrations) అయ్యే వాహనాలకు మాత్రమే టీజీ (TG) నెంబర్ ప్లేట్లను కేటాయిస్తారని సమాచారం.

ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించేది లేదు, నీటి ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, కృష్ణా, గోదావరి జలాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రెస్ మీట్

ఒకవేళ పాత వాహనాలకు టీఎస్‌ ఉన్న స్థానంలో టీజీగా మార్చాలి అంటే మాత్రం అధికారులకు పెద్ద తలనొప్పి అనే చెప్పాలి.ఎందుకంటే కొన్ని లక్షల వాహనాలు ప్రస్తుతం తెలంగాణలో ఉన్నాయి. కానీ ప్రస్తుతానికి అలాంటి ప్రకటన ఏది రాలేదు. ఏదైనా విషయం ఉంటే అధికారులు అధికారికంగా ప్రకటిస్తారని ..అప్పటి వరకు వాహనదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు వెల్లడించారు.