Thummala Counter To KCR: పువ్వాడ పూజకు పనికి రాని పువ్వు! కేసీఆర్ వ్యాఖ్యలపై ఘాటు కౌంటర్ ఇచ్చిన తుమ్మల నాగేశ్వరరావు, నేను రైతులకు ఉపయోగపడుతానంటూ కామెంట్

అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. సెటైర్లు వేసుకుంటున్నారు. తాజాగా పువ్వాడను పువ్వుతో పోల్చిన కేసీఆర్(KCR), తుమ్మలను తుమ్మ ముల్లుతో పోల్చారు. దీనికి కాంగ్రెస్ ఖమ్మం అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswararao) కౌంటర్ ఇచ్చారు.

Tummala Nageswara rao (Photo-Video Grab)

Khammam, NOV 05: అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయం వేడెక్కింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. సెటైర్లు వేసుకుంటున్నారు. తాజాగా పువ్వాడను పువ్వుతో పోల్చిన కేసీఆర్(KCR), తుమ్మలను తుమ్మ ముల్లుతో పోల్చారు. దీనికి కాంగ్రెస్ ఖమ్మం అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswararao) కౌంటర్ ఇచ్చారు. సీఎం కేసీఆర్, మంత్రి పువ్వాడ అజయ్ లపై విరుచుకుపడ్డారు. ”మంత్రి పువ్వాడ 4 పార్టీలు మారారు. అజయ్ (Puvvada Ajay) తన తండ్రిని అప్రతిష్ట పాలు చేశారు. రాష్ట్రం విడిపోయేదాకా తెలుగుదేశాన్ని కాపాడే ప్రయత్నం చేశాను. కేసీఆర్ మూడు నెలలు బమితిలాడితే వెళ్లాను. పువ్వాడ వయ్యారి భామ లాంటి పువ్వు. పూజకు పనికి రాని పువ్వు. తుమ్మ చెట్టు ముదిరితే నీళ్లు లేకుండా బతికి అరక లాగా మారి, రైతుకు అన్నం పెట్టడానికి తుమ్మ పనికొస్తుంది.

CM KCR Election Campaign Schedule: 15 రోజులు 54 సభలు, దీపావళి తర్వాత వరుస సభల్లో పాల్గొననున్న సీఎం కేసీఆర్, ఈ నెల 25న హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ 

పువ్వాడ మీ బాబు కాలంలో ట్యాంకర్లున్నాయనే విషయం మరిచిపోకు. ఖమ్మంలో (Khammam) కట్టిన ప్రతి ట్యాంకుని అడుగు. అక్కడ పెట్టిన బోర్డులు చూడు నీకు తెలుస్తుంది. పువ్వాడకు మెడకాయ మీద తలకాయ లేదు. కాబట్టే బస్ డిపో రోడ్డులో సెంట్రల్ లైటింగ్ వేశాడు. గోళ్లపాడు ఛానల్ లో నిధులు మింగింది నువ్వు. నేను హైవేల పై లైట్లు పెట్టా. నువ్వు కమీషన్ల కోసం డొంకల్లో లైట్లు వేశావు.

Chandra Babu Naidu: చంద్రబాబు నాయుడి నివాసానికి వెళ్లిన పవన్ కళ్యాణ్..బెయిల్‌పై వచ్చిన బాబుతో మర్యాదపూర్వక భేటీ..(Watch Video) 

కేసీఆర్ కు దిమ్మదిగిరిపోయి మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ కు (BRS) దిక్కులేని సమయంలో నేను జెండా కట్టి జిల్లాను అప్పజెప్పా. 6వేల డబుల్ బెడ్ రూమ్ లు నేను తీసుకొచ్చా. ఆరేళ్లు అయినా పువ్వాడ ఒక్క పథకం తేలేదు. కాంట్రాక్టర్లను బెదిరించిన సంస్కృతి పువ్వాడది. ఆంధ్ర-తెలంగాణలో కట్టిన ప్రతి ప్రాజెక్టులో నా భాగస్వామ్యం ఉంది. కేసీఆర్ కు మంత్రి పదవి ఇప్పించింది నేను. కావాలంటే చంద్రబాబుని అడగొచ్చు. చంద్రబాబు మొదలు మీకు ఫారెస్ట్ మినిస్టర్ పోర్ట్ ఫోలియో రాశారు. ముఖ్యమంత్రి ప్రతిసారి అబద్దాలు మాట్లాడతారు. కాబట్టి మనం పట్టించుకోనక్కర్లేదు.

ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పేరుకే ఎంపీ. ఒక్క కార్యక్రమానికి కూడా ఆయనను పిలవడం లేదు. గౌరవించడం లేదు. 30వ తేదీన పువ్వాడను 14 అడుగుల గోతిలో పాతి పెడతారు. పువ్వాడ నీ భూమి కూనవరం. ఈసారి నువ్వు వచ్చి అబద్దాలు మాట్లాడితే నిన్ను డివిజన్ లలో తిరగనివ్వను.