Tiranga Rally: సీపీ క్యారెక్టర్ లెస్ ఫెలో అంటూ మండిపడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉత్తమ్ ఒళ్లు దగ్గర పెట్టుకోమంటూ వార్నింగ్ ఇచ్చిన తలసాని, మాటల తూటాలతో సాగిన కాంగ్రెస్ తిరంగా ర్యాలీ, గవర్నర్‌ను కలవనున్న తెలంగాణా కాంగ్రెస్ నేతలు
కాంగ్రెస్ పార్టీ 135వ ఆవిర్భావ దినోత్సవం( Congress 135th Foundation Day)సందర్భంగా టీ-కాంగ్రెస్ పార్టీ (Telangana Congress)తలపెట్టిన తిరంగా ర్యాలీలో (Tiranga Rally)మాటల తూటాలు పేలాయి. ఈ ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో గాంధీ భవన్‌లోనే (Gandhi Bhavan) తెలంగాణా కాంగ్రెస్ నేతలు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు.
December 29, Hyderabad:కాంగ్రెస్ పార్టీ 135వ ఆవిర్భావ దినోత్సవం( Congress 135th Foundation Day)సందర్భంగా టీ-కాంగ్రెస్ పార్టీ (Telangana Congress)తలపెట్టిన తిరంగా ర్యాలీలో (Tiranga Rally)మాటల తూటాలు పేలాయి. ఈ ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో గాంధీ భవన్‌లోనే (Gandhi Bhavan) తెలంగాణా కాంగ్రెస్ నేతలు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు.
ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంపై ప్రభుత్వం, పోలీసుల తీరుపై కాంగ్రెస్ నాయకులు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు అనుమతి ఇవ్వరు.. మీరంతా నిరంశకుంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్ (RSS) భారీ సభకు అనుమతినిచ్చిన కేసీఆర్ సర్కారు.. తిరంగా మార్చ్ పేరుతో కాంగ్రెస్ నిర్వహించే ర్యాలీకి ఎందుకు ఇవ్వదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి (TPCC president) ప్రశ్నించారు.
కాగా తిరంగా ర్యాలీ నిర్వహించేందుకు బయటకు వస్తున్న కాంగ్రెస్ నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో అంతా ఆగ్రహావేశాలతో ఊగిపోయారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్సీ నేత భట్టి విక్రమార్క, సీనియర్ నేత షబ్బీర్ అలీ రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. గాంధీ భవన్ ముందే నేతలంతా సత్యాగ్రహ దీక్ష చేయడంతో అంతా గందరగోళ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో భట్టి విక్రమార్క పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
ఈ సందర్భంగా సీపీ అంజనీ కుమార్‌పై (Hyderabad Police Commissioner) టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. క్యారెక్టర్ లెస్ ఫెలో, ఒక దిగజారిన వ్యక్తి.. ఓ అవినీతిపరుడు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీపీగా ఉండే అర్హత ఆయనకు లేదని మండిపడ్డారు. అంజనీకుమార్ (Anjani Kumar) ఆర్ఎస్ఎస్ తొత్తు అని, దగ్గరుండి ఆర్ఎస్ఎస్ సభకు ఏర్పాట్లు చేశారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. గాంధీభవన్‌లో శాంతియుతంగా దీక్ష చేస్తుంటే..పోలీసులకు ఇక్కడ ఏం పని అంటూ ప్రశ్నించారు. సెక్షన్ 8 ప్రకారం గవర్నర్‌కు చర్యలు తీసుకొనే అధికారం ఉందన్నారు. దీనిపై 2019, డిసెంబర్ 30వ తేదీ సోమవారం గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామని చెప్పారు.
భట్టి విక్రమార్క
శాంతియుతంగా చేసే సత్యాగ్రహ దీక్షను కూడా చూసి కేసీఆర్ భయపడుతున్నారు. కాంగ్రెస్ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చి పెట్టింది. రాజ్యాంగాన్ని అందించింది. గాంధీ భవన్‌కు వచ్చే కాంగ్రెస్ కార్యకర్తలను కూడా ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. ఇది పోలీసు రాజ్యమా? లేక ప్రజాస్వామ్య రాజ్యమా అర్థం కావట్లేదు. అరెస్టులు చేయాలని ఇక్కడున్న పోలీసులు అధికారులకు కూడా కమిషనర్ ఆదేశాలిస్తున్నారు.’’ అని భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు.
షబ్బీర్ అలీ
పోలీసులంతా ముఖ్యమంత్రికి చెంచాలుగా మారిపోయారు. ఇలా కాకుండా ఖాకీ దుస్తుల విలువ కాపాడుకోండని మేం కోరాం. అయినా పర్మిషన్ ఇవ్వకపోతే మేం సత్యాగ్రహ దీక్ష చేస్తున్నాం. మా కార్యకర్తలను మా ఆఫీసుకు రానివ్వకుండా చేస్తుండడంతో మేం ధర్నా చేస్తున్నాం.’’ అని షబ్బీర్ అలీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
మండిపడిన మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్
ర్యాలీకి అనుమతివ్వలేదనే అక్కసుతో పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌పై లేనిపోని అభాండాలు మోపడం పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ దిగజారుడుతనానికి నిదర్శనమని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి (Animal Husbandry Minister) తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. ఎంపీగా వ్యవహరిస్తున్న ఉత్తమ్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం సరైంది కాదని, శాంతిభద్రతల పరిరక్షణలో కమిషనర్ సేవలు ఎనలేనివని, హైదరాబాద్ పోలీసులకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన అధికారిని తూలనాడడం దురదృష్టకరమన్నారు. గతంలో కాంగ్రెస్ నిర్వహించిన పలు కార్యక్రమాలకు అనుమతిచింది కూడా ఈ అధికారే అనే విషయాన్ని ఉత్తమ్ మరచిపోయినట్లున్నారని ఎద్దేవా చేశారు.
పోలీసుశాఖపై లేనిపోని ఆరోపణలు చేయడం ఉత్తమ్ లాంటి నాయకులకు తగదని, ఇకనైనా ఒళ్లు దగ్గర పెట్టు కుని మాట్లాడితే మంచిదని తలసాని హెచ్చరించారు. అనుమతిస్తే మంచి అధికారి, అనుమతించకుంటే అవినీతి అధికారి అంటూ గగ్గోలు పెట్టడం ఆయన చౌకబారు రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. క్రమశిక్షణకు మారుపేరైన ఆర్మీలో పనిచేసిన ఉత్తమ్.. ప్రభుత్వ అధికారుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యానించడం మంచిపద్ధతి కాదని శ్రీనివాస్‌యాదవ్ (Talasani Srinivas Yadav) హితవు పలికారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)