Traffic Diversions in Hyd: హైదరాబాద్‌ లో ట్రాఫిక్ డైవర్షన్లు, ఈ రూట్లలో వెళ్తున్నారా? అయితే చుక్కలు కనిపిస్తాయి, ట్రాఫిక్ ప్రత్యామ్నాయ మార్గాల ఇవే!

ఆయ‌న బేగంపేట విమానాశ్రయం నుంచి జలవిహార్ వరకు ర్యాలీ చేప‌ట్టనున్నారు. ఈ నేప‌థ్యంలో పోలీసులు ఆయా మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 11 గంట‌ల‌ నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ట్రాఫిక్ మ‌ళ్ళింపులు ఉంటాయ‌ని చెప్పారు.

Hyderabad Traffic Police (Photo Credits: Facebook)

Hyderabad, July 01: విప‌క్ష పార్టీల రాష్ట్రప‌తి అభ్యర్థి య‌శ్వంత్ సిన్హా (Yashwanth sinha) శనివారంహైద‌రాబాద్ రానున్నారు. ఆయ‌న బేగంపేట (Begumpet) విమానాశ్రయం నుంచి జలవిహార్ వరకు ర్యాలీ చేప‌ట్టనున్నారు. ఈ నేప‌థ్యంలో పోలీసులు ఆయా మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు (Traffic diverson) విధించారు. ఉదయం 11 గంట‌ల‌ నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ట్రాఫిక్ మ‌ళ్ళింపులు ఉంటాయ‌ని చెప్పారు. బేగంపేట్ విమానాశ్రయం–లైఫ్ స్టైల్ భ‌వ‌న స‌ముదాయం– సోమాజిగూడ – ఖైరతాబాద్ – ఐమ్యాక్స్ రోటరీ – నెక్లెస్ రోడ్ – జలవిహార్ నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావచ్చు. దీంతో ట్రాఫిక్ రద్దీగా ఉండొచ్చు. స్థానిక పరిస్థితుల‌కు అనుగుణంగా అవసరమైతే ట్రాఫిక్‌ను మ‌ళ్ళిస్తామ‌ని పోలీసులు తెలిపారు.

గ్రీన్ ల్యాండ్స్ నుంచి రాజ్ భవన్ రోడ్ వైపు వచ్చే వాహ‌నాల‌ను మోనప్ప ఐలాండ్/ రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద పంజాగుట్ట వైపుగా మళ్ళిస్తారు. ఖైరతాబాద్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వాహ‌నాల‌ను నెక్లెస్ రోటరీ వైపు అనుమతించరు. ఖైరతాబాద్ జంక్షన్ వద్ద షాదన్ కళాశాల వైపునకు మళ్లిస్తారు.

Telangana: తెలంగాణ పుట్టుకనే ప్రశ్నించిన ప్రధాని మోదీ, హైదరాబాద్‌కు ఏ ముఖం పెట్టుకుని వస్తారు, బీజేపీ వల్ల దేశానికి ఉపయోగం లేదు, మండిపడిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 

మినిస్టర్ రోడ్డు నుండి సంజీవయ్య పార్కు వైపు వచ్చే ట్రాఫిక్‌ను అనుమతించరు మరియు నల్లగుట్ట వంతెన వద్ద బుడ్డభవన్, ట్యాంక్‌బండ్ (Tank bund) వైపు మళ్లిస్తారు. ట్యాంక్‌బండ్ నుంచి సంజీవయ్య పార్క్ వైపున‌కు వాహ‌నాల‌ను అనుమతించరు. వాటిని దారి మ‌ళ్ళిస్తారు. మింట్ కాంపౌండ్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వాహ‌నాల‌ను రోటరీ వైపునుకు అనుమతించ‌రు. ఆ వాహ‌నాల‌ను సైఫాబాద్ పోలీస్ స్టేష‌న్‌ వద్ద నుంచి ఖైరతాబాద్ బడా గణేశ్‌ వైపున‌కు మళ్లిస్తారు.

Vishal on AP Politics: కుప్పం నుంచి నేను పోటీ చేయడం లేదు, అసలు ఏపీ రాజకీయాల్లోకే రావడం లేదు, క్లారిటీ ఇచ్చిన నటుడు విశాల్  

అలాగే పెద్ద సంఖ్యలో రాజకీయ నాయకులు బేగంపేట విమానాశ్రయం నుంచి పంజాగుట్ట-కేబీఆర్ పార్క్-జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్- రోడ్ నంబ‌రు.36-మాదాపూర్ మీదుగా ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య హెచ్‌ఐసీసీ నోవాటెల్, మాదాపూర్‌కు తరలివెళ్లే అవకాశం ఉంది. దీంతో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ ఉండొచ్చు. వాహ‌న‌దారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్ళాల‌ని, త‌మ‌కు సహకరించాలని పోలీసులు సూచించారు.