Telangana: తెలంగాణ పుట్టుకనే ప్రశ్నించిన ప్రధాని మోదీ, హైదరాబాద్‌కు ఏ ముఖం పెట్టుకుని వస్తారు, బీజేపీ వల్ల దేశానికి ఉపయోగం లేదు, మండిపడిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
TRS MLAs (Photo-TRS Office)

Hyd, July 1: తెలంగాణకు కేంద్రం నుంచి ఒక మంచిపనైనా చేయించడం చేతగాని దద్దమ్మగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (kisan Reddy) మిగిలిపోయారంటూ ఎమ్మెల్యే బాల్కసుమన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణను మోసం చేస్తోంది కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కాదా?. కేంద్రమంత్రిగా తెలంగాణ (Telangana) కోటాలో ఉండి రాష్ట్రానికి కిషన్ రెడ్డి ఏం తెచ్చాడు?. కేంద్రం తెలంగాణకు ఏ శాఖలోనైనా ఒక్క ప్రాజెక్టు ఇవ్వకున్నా నోరు మూసుకొని కూర్చుంది కిషన్ రెడ్డి కాదా?.

విభజన చట్టం ప్రకారం కేంద్రం ఒక్క హామీ నెరవేర్చకున్నా కిషన్ రెడ్డి ఎందుకు కేంద్రాన్ని ప్రశ్నించరు?. కిషన్ రెడ్డిని ఢిల్లీలోని కేంద్ర కార్యాలయాల్లో గుమస్తాలు కూడా గుర్తు పట్టరు. తెలంగాణ కోసం ఎమ్మెల్యేలు ఆనాడు రాజీనామా చేస్తే.. కిషన్ రెడ్డి చేయకుండా పారిపోయాడు. తెలంగాణ ద్రోహి కిషన్ రెడ్డి. తెలంగాణ గడ్డపై కాకుండా ఢిల్లీలో మోదీ, అమిత్ షా దగ్గర ఎగిరిపడితే బాగుంటుంది. దేశాన్ని కార్పొరేట్‌ సంస్థలకు అప్పగిస్తున్న మోసపు చరిత్ర బీజేపీది.

జూన్ 2న హైదరాబాద్‌కు రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా, ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా రిసీవ్ చేసుకుంటారని తెలిపిన మంత్రి తలసాని

కిషన్ రెడ్డి వల్ల తెలంగాణకు, నరేంద్రమోదీ (PM Modi) వల్ల దేశానికి ఉపయోగం లేదు. నరేంద్రమోదీ ప్రజా ఖండన ప్రధానిగా చరిత్రలో నిలిచిపోతారు. బీజేపీ ఒక దొంగలముఠా. జాతీయ కార్యవర్గ భేటీ పేరుతో బీజేపీ నాయకులు వసూళ్లకు దిగారు. దౌర్జన్యంగా డబ్బులు వసూళ్లు చేస్తున్నారు. బీజేపీ అవినీతి అక్రమాలు త్వరలో బయటపెడుతాం. పార్లమెంట్ సాక్షిగా వసూళ్ల దందాను నిలదీస్తాం. తెలంగాణకు ఇప్పటి దాకా ఏం చేశారో, రాబోయే రోజుల్లో ఏం చేస్తారో చెప్పాలి' అని ఎమ్మెల్యే బాల్కసుమన్‌ బీజేపీని డిమాండ్‌ చేశారు.

మాజీ మంత్రి, ఎమ్మెల్యే దానం నాగేందర్ ,ఎమ్మెల్యే జాజుల సురేందర్ BJPపై విరుచుకుపడ్డారు. బీజేపీజాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ లో జరగబోతున్నాయి. ఈ జాతీయ కార్యవర్గ సమావేశాలకు వస్తున్న బీజేపీ జాతీయ నేతలకు తెలంగాణ అభివృద్ధిని చూసే సదవకాశం కలుగుతోంది. తెలంగాణ అభివృద్ధి ని చూసి బీజేపీ నేతలకు కనువిప్పు కలగాలి. ఇప్పటికే మా పథకాలను పలు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టాయి. ఈ సమావేశాలలో మా పథకాలు మరిన్ని అమలు చేసే విషయాన్ని చర్చించండి. తెలంగాణ కు రావాల్సిన ప్రయోజనాలను బీజేపీ సమావేశాల్లో చర్చించండి అని అన్నారు.

హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదే, ఈ నెల 3న రాజ్‌భవన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ బస, పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఈ నెల 3న బీజేపీ బహిరంగ సభ

హైద్రాబాద్ లో 30 ఫ్లై ఓవర్లు కట్టాం .వేల కోట్ల తో అభివృద్ధి చేశాము.. ఇందులో కేంద్రం వాటా ఒక్క పైసా అయినా ఉందా..తెలంగాణ లో చేపలు కూడా బాగా దొరుకుతున్నాయి.. అవి బీజేపీ నేతలు తిని ఇక్కడి అభివృద్ధిని తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు.సాగునీటి ప్రాజెక్టులకు ఇప్పటికైనా జాతీయ హోదా ఇవ్వండని ప్రశ్నించారు. కేసీఆర్ ను తిట్టడం తప్ప బీజేపీ కి మరో ఎజెండా లేదు. తెలంగాణ కేసీఆర్ వెంటే ఉంది.. ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉన్నారు. రానున్న రోజుల్లో టీ ఆర్ ఎస్ లో భారీ చేరికలు ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు.

దానం నాగేందర్ ప్రశ్నలు

..సాగునీటి ప్రాజెక్టులకు ఇప్పటికైనా జాతీయ హోదా ఇవ్వండి

.. తెలంగాణ పై సవతి తల్లి ప్రేమను బీజేపీ మానుకోవాలి

..బండి సంజయ్ కొత్త బిచ్చగాడిలా కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నారు

..బండి సంజయ్ హైద్రాబాద్ వరదల పుడు సాధ్యం కానీ విషయాలు మాట్లాడారు

..వరద బాధితులకు 25 వేలు ఇస్తా అన్నాడు.. కేంద్రం నుంచి ఒక్క పైసా అయినా తెచ్చాడా

...హైద్రాబాద్ లో 30 ఫ్లై ఓవర్లు కట్టాం .వేల కోట్ల తో అభివృద్ధి చేశాము.. ఇందులో కేంద్రం వాటా ఒక్క పైసా అయినా ఉందా

...కేంద్రం లో బ్రిటిష్ పాలన జరుగుతోంది

..విభజించి పాలించు అనే ధోరణి కేంద్రం లో జరుగుతోంది

...నియోజకవర్గాలకు వెళ్లే బీజేపీ జాతీయ నేతలు అభివృద్ధి పై వాస్తవాలు చెప్పాలి

..లేకుంటే మేమే 5 వ తేదీ తర్వాత మేము వాస్తవాలు చెబుతాం

...మోడీ అర చేతిలో వైకుంఠం చూపిస్తున్నారు

..దేశానికి ఇప్పటిదాకా చేసిన మంచి పని ఒక్కటి లేదు

...ప్రభుత్వాలను కూల్చడమే తప్ప బీజేపీ కి వేరే పని లేదు

...అగ్ని పథ్ స్కీం తో యువత ఆశల పై నీళ్లు చల్లారు

...మోడీ ని చూసి కేసీఆర్ భయపడితే తెలంగాణ తెచ్చేవారా

. .కేసీఆర్ అంటే అభివృద్ధికి పర్యాయ పదం

...కేసీఆర్ హాయం లో తెలంగాణ అభివృద్ధి ఆగదు

..మాట ఇచ్చి తప్పడం బీజేపీ నైజం

...మేము చెప్పింది చేస్తాం

..బీజేపీ కుట్రలు ప్రజలకు అర్థమయ్యాయి.. ఆ పార్టీ కి గుణ పాఠం తప్పదు

..హైద్రాబాద్ అభివృద్ధిని బండి సంజయ్ బీజేపీ జాతీయ నేతలకు చూపించాలి

..కళ్ళు లేని వారికి తప్ప అందరికీ మా అభివృద్ధి కనిపిస్తుంది

..తెలంగాణ అభివృద్ధి ఎజెండా పై జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చర్చించాలి

..తెలంగాణ కు ప్రత్యేక ప్రాజెక్టులు ఈ సమావేశాల్లో ప్రకటించాలి

..తెలంగాణ కు నిధులు ప్రకటించక పోతే మా కార్యాచరణ త్వరలోనే వెల్లడిస్తాం

...చాలా యేండ్లు ఉత్తరాది రాష్ట్రాల్లో అధికారం లో ఉన్న బీజేపీ తెలంగాణ లాంటి పథకాలు ఎందుకు తేవడం లేదు

.. తెలంగాణ అభివృద్ధి గురించి చర్చించక పోతే బీజేపీ కి ఇక్కడి ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర ఉందని భావించాల్సి ఉంటుంది

...అన్ని నియోజకవర్గాల్లో బీజేపీ నేతలను నిలదీసే పరిస్థితీ వస్తుంది

...కేసీఆర్ అంటే కామ్ చళ్తా రహేగా

...మోడీ ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివితే కుదరదు

...తెలంగాణ కేసీఆర్ వెంటే ఉంది.. ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉన్నారు

..రానున్న రోజుల్లో టీ ఆర్ ఎస్ లో భారీ చేరికలు ఉంటాయి

..టీ ఆర్ ఎస్ లోకి నేతలు వరదల్లా వస్తారు

..తెలంగాణ లో టీ ఆర్ ఎస్ కు ప్రత్యామ్నాయం లేదు

ఎమ్మెల్యే జాజుల సురేందర్ ప్రశ్నలు

...తెలంగాణ పుట్టుకనే ప్రశ్నించిన మోడీ ఏ మొహం పెట్టుకుని హైద్రాబాద్ వస్తున్నారు

...తెలంగాణ కు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా బీజేపీ నెరవేర్చ లేదు

...ప్రభుత్వరంగ సంస్థలను కారు చౌక గా అమ్మేస్తున్నారు

...కేసీఆర్ ను తిట్టడం తప్ప బీజేపీ కి మరో ఎజెండా లేదు

..తెలంగాణ లో తిరుగుతున్న బీజేపీ జాతీయ నేతలకు ఇక్కడి అభివృద్ధి ఆశ్చర్యం కలిగిస్తోంది

...ప్రపంచమంతా తెలంగాణ వైపు చూస్తోంది

..బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇక్కడి అభివృద్ధి ఉందా

...కేసీఆర్ దమ్మున్న ముఖ్యమంత్రి

...ఢిల్లీ వేదిగ్గా రైతుల కోసం నినదించిన ఏకైక సీఎం కేసీఆర్

.. తెలంగాణ లో చేపలు కూడా బాగా దొరుకుతున్నాయి.. అవి బీజేపీ నేతలు తిని ఇక్కడి అభివృద్ధిని తెలుసుకోవాలి

.. అగ్ని పథ్ ను వెంటనే రద్దు చేయాలి

.. బీజేపీ కి గతం లో వచ్చిన 4 ఎంపీ సీట్లు కూడా రావు

...బీజేపీ నేతలు హైద్రాబాద్ పై మిడతల దండు లా దాడికి వస్తున్నారు

...వారికి ప్రజలు గుణ పాఠం చెబుతారు