Yashwant Sinha to Visit Hyd: జూన్ 2న హైదరాబాద్‌కు రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా, ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా రిసీవ్ చేసుకుంటారని తెలిపిన మంత్రి తలసాని
Minister Talasani Srinivas Yadav (Photo-TRS Offcie)

Hyd, July1: రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా శనివారం ఉదయం హైదరాబాద్‌కు రానున్నట్లు (Yashwant Sinha to visit Hyd) పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ తెలిపారు. ఈ మేరకు జలవిహార్‌లో మంత్రి తలసాని మాట్లాడుతూ.. 'యశ్వంత్‌సిన్హా పర్యటనలో ముఖ్యమంత్రి సహా మంత్రులు, గ్రేటర్‌ ప్రజాప్రతినిధులు హాజరవుతారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా యశ్వంత్‌ సిన్హాని రిసీవ్‌ చేసుకుంటారు. బేగంపేట నుంచి ఖైరతాబాద్‌ మీదుగా జలవిహార్‌ వరకు ర్యాలీగా వస్తారు. బేగంపేట ఎయిర్ పోర్ట్ నుండి భారీ బైక్ ర్యాలీతో బేగంపేట, క్యాంప్ ఆఫీస్, రాజ్ భవన్ రోడ్ ల మీదుగా నెక్లెస్ రోడ్ లోని చేరుకోవడం జరుగుతుందని చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికలో ఓటింగ్‌లో పాల్గొనే వారందరూ ఇక్కడ పాల్గొంటారు.

ఓ వైపు బీజేపీ మీటింగ్‌ జరుగుతుంది. మరోవైపు యశ్వంత్‌ సిన్హా సమావేశం జరుగుతంది. ఈ ఎనిమిదేళ్లో బీజేపీ దేశానికి చేసిందేమీ లేదు. వాళ్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలంగాణలో పప్పులు ఉడకవు. రేపు హైదరాబాద్‌కి వచ్చే నేతలు నగర అందాలని చూస్తారు. ఈ మూడు రోజులు అనేక మంది టూరిస్టులుగా వచ్చి చూసి వెళ్లిపోతారు. దేశంలో మార్పు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. కిషన్‌రెడ్డి కేంద్రమంత్రిగా మూడేళ్లయింది. సికింద్రాబాద్‌లో ఏ పని చేశారో చెప్పాలి. బీజేపీ తాటాకు చప్పుళ్లకు టీఆర్‌ఎస్‌ భయడదు' అని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ అన్నారు.

హైదరాబాద్ లో కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తున్న BJP నేతలు తెలంగాణ రాష్ట్రానికి, ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల BJP ముఖ్యమంత్రులు మూడు రోజుల పాటు నగరానికి వచ్చిన టూరిస్ట్ లుగా అభివర్ణించారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ని చూసి తరిస్తారని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శ్రీరామరక్ష అని, TRS పార్టీ ప్రభుత్వాన్నే అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. అబద్ధాల కోరు BJP ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. కేంద్రంలో ప్రభుత్వం మారాలని ప్రజలు కోరుకుంటున్నారని, BJP కార్పొరేటర్ లు TRS లో చేరడమే ఇందుకు నిదర్శనంగా వారు పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదే, ఈ నెల 3న రాజ్‌భవన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ బస, పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఈ నెల 3న బీజేపీ బహిరంగ సభ

BJP రాష్ట్రపతి అభ్యర్థి సొంత గ్రామానికే విద్యుత్ సౌకర్యం లేకపోవడం శోచనీయం అన్నారు. ఆర్మీని ఔట్ సోర్సింగ్ చేయాలనే ఉద్దేశం తోనే అగ్నిపథ్ ను తీసుకొచ్చారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి కారణంగా అనేకమంది అగ్నిపథ్ కు వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. గతంలో పరేడ్ గ్రౌండ్ లో TRS పార్టీ సభ కోసం అనుమతి కోరితే రాజకీయ పార్టీల సభకు అనుమతించమని చెప్పారని, నేడు BJP సభకు ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. ఇప్పటికైనా అబద్దాలు మాట్లాడటం మానుకోవాలని హితవుపలికారు. వీలైతే రాష్ట్రానికి ఒక జాతీయ ప్రాజెక్ట్ ను మంజూరు చేసి ప్రజల మెప్పును పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్ లు రావుల శ్రీధర్ రెడ్డి, గజ్జెల నగేష్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ TRS పార్టీ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, నాంపల్లి నియోజకవర్గ ఇంచార్జి ఆనంద్ గౌడ్, పద్మారావు నగర్ ఇంచార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.