Traffic Restrictions In Hyderabad: హైదరాబాద్‌లో ఆదివారం రోజు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా రూట్లలో ప్రయాణికులకు ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతి లేదని పోలీసుల ప్రకటన, ట్రాఫిక్ డైవర్షన్ ఎందుకంటే?
ఇందులో భాగంగా హైదరాబాద్ నగరంలో పెట్రోల్ కార్/బ్లూ కోల్ట్ ర్యాలీ, అంబేద్కర్ విగ్రహాం వద్ద టెక్నాలజీ ఎగ్జిబిషన్, ఉమెన్ సేఫ్టి కార్నివాల్, చార్మినార్ వరకు పుట్ మార్చ్ ఉంటుంది.
Hyderabad, June 03: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది (Telanagana Dashabdi) ఉత్సవాలలో భాగంగా ఈ నెల 4వ తేదీన రాష్ట్ర పోలీస్ శాఖకు సంబంధించి ‘సురక్ష దినోత్సవం’ (Suraksha Dinostav) నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నగరంలో పెట్రోల్ కార్/బ్లూ కోల్ట్ ర్యాలీ, అంబేద్కర్ విగ్రహాం వద్ద టెక్నాలజీ ఎగ్జిబిషన్, ఉమెన్ సేఫ్టి కార్నివాల్, చార్మినార్ వరకు పుట్ మార్చ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో భారీ సంఖ్యలో వాహనాలు, సందర్శకులు వచ్చే అవకాశముందని నగర ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్‌బాబు తెలిపారు. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు పరిస్థితులను బట్టి ఆయా రూట్లలో ట్రాఫిక్ మళ్లింపు (Traffic Restrictions), నిలిపివేయడం జరుగుతుందన్నారు.
-ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సంజీవయ్య పార్కు నుంచి చార్మినార్ వరకు పెట్రోల్ కార్/బ్లూ కోల్ట్స్ ర్యాలీ వెళ్లి తిరిగి అదే రూట్‌ల వస్తుంది. సంజీవయ్య పార్కు, బుద్దభవన్, షెయిలింగ్ క్లబ్, చిల్డ్రన్స్ పార్కు, అంబేద్కర్ విగ్రహాం, లిబర్టీ, బషీర్‌బాగ్, బీజేఆర్ విగ్రహం, అబిడ్స్, ఎంజే మార్కెట్, సిద్దిఅంబర్ బజార్, అఫ్జల్‌గంజ్, నయాపూల్, మదీనా, పత్తర్‌ఘట్టి, గుల్జార్‌హౌస్, ఛత్రినాక, చార్మినార్ వరకు కొనసాగుతుంది. ఈ ర్యాలీ వెళ్లి, వచ్చే సందర్భంగా ఆయా జంక్షన్ల వద్ద ట్రాఫిక్‌ను నిలిపివేస్తారు.
-ట్యాంక్‌బండ్‌పై ఇరువైపులా, పీవీఎన్‌ఆర్ మార్గ్, బుద్దభవన్, నల్లగుట్ట, ఇందిరాగాంధీ రోటరీ రూట్లలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి.
-ట్యాంక్‌బండ్‌పై సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు టీఎస్ ఉమెన్ పోలీస్ సేఫ్టి వింగ్ కార్నివాల్ ఉంటుంది. ఈ సమయంలో ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్ అనుమతి ఉండదు.
-రాత్రి 10 గంటల నుంచి 11 గంటల వరకు ఎంజే మార్కెట్ నుంచి చార్మినార్ వరకు పుట్‌మార్చ్ ఉంటుంది. ఈ సందర్భంగా ఎంజే మార్కెట్ నుంచి చార్మినార్ వరకు ర్యాలీ సందర్భంగా ట్రాఫిక్‌ను నిలిపివేస్తారు.
-అంబేద్కర్ విగ్రహాం వద్ద ట్రాఫిక్ సేఫ్టి, యాంటీ డ్రగ్ క్యాంపెయిన్, సైబర్ సెక్యూరిటీ, ఉమెన్ సేఫ్టీ తదితర అంశాలపై ప్రదర్శనలుంటాయి.