IPL Auction 2025 Live

TS Covid Update: తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా, తాజాగా 1,531 పాజిటివ్‌ కేసులు, ఆరుగురు మృతితో 1330కి చేరుకున్న మరణాల సంఖ్య

దీంతో ఇప్పటి వరకు మొత్తం నమోదైన కేసుల సంఖ్య 2,37,187కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో ఆరుగురు మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 1330కి (Covid Deaths) చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. కాగా నిన్న ఒక్క రోజే 1,048 మంది కోలుకున్నారు.

coronavirus ward in hospital

Hyderabad, Oct 30: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 43,790 మందికి కరోనా వైరస్‌ (Telangana Coronavirus) నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 1,531 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు మొత్తం నమోదైన కేసుల సంఖ్య 2,37,187కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో ఆరుగురు మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 1330కి (Covid Deaths) చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. కాగా నిన్న ఒక్క రోజే 1,048 మంది కోలుకున్నారు.

దీంతో ఇప్పటివరకు కరోనా (Coronavirus) నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,17,401కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 18,456 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వారిలో 15,425 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 42,40,748కి చేరింది.

కొత్త కేసుల్లో హైదరాబాద్‌లో 288, మేడ్చల్‌-మల్కాజిగిరిలో 118, రంగారెడ్డిలో 115, నల్లగొండలో 93, ఖమ్మంలో 84, భద్రాద్రి-కొత్తగూడెంలో 83 నమోదయ్యాయి. అత్యల్పంగా నారాయణపేటలో 2, కుమ్రంభీం-అసిఫాబాద్‌లో 3 కేసులు వచ్చాయి.

హైదరాబాద్ నుంచి తిరుపతికి తగ్గనున్న దూరం, కల్వకుర్తి నుండి కరివేన వరకు 122 కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్రం ఆమోదం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావుకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించారు. అస్వస్థతకు గురవడంతో పరీక్ష చేయించుకున్నానని.. పాజిటివ్‌గా తేలిందని తెలిపారు.



సంబంధిత వార్తలు

TG Weather Update: తెలంగాణపై చలి-పులి పంజా.. అన్ని జిల్లాల్లో 15 డిగ్రీలలోపు రాత్రి ఉష్ణోగ్రతలు.. కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌ (యూ)లో రికార్డు స్థాయిలో 8.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు.. రానున్న మూడ్రోజుల్లో ఇంకా పడిపోనున్న ఉష్ణోగ్రతలు

Rains in AP: బంగాళాఖాతంలో వాయుగుండం.. నేటి నుంచి ఏపీలో భారీ వర్షాలు.. ఈ నెల 29 వరకు వానలే వానలు.. దక్షిణ కోస్తాలో ఈదురుగాలులు

Vaibhav Suryavanshi: 13 ఏళ్లకే ఐపీఎల్ మెగా వేలంలోకి, వైభవ్ సూర్యవంశీని రూ. 1.1 కోట్లకు కొనుగోలు చేసిన రాజస్థాన్ రాయల్స్

TG Weather Update: చలితో గజగజలాడుతున్న తెలంగాణ.. సంగారెడ్డి, ఆదిలాబాద్‌ జిల్లాల్లో 9 డిగ్రీల కంటే తక్కువకు పడిపోయిన ఉష్ణోగ్రతలు.. అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరిక