New Covid Strain in TS: తెలంగాణలో కలకలం రేపుతున్న కొత్త కోవిడ్ స్ట్రెయిన్, 20కు చేరిన అనుమానిత కేసుల సంఖ్య, ఇంకా చిక్కని 154 మంది జాడ, అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం
యూకే నుంచి తెలంగాణకు వచ్చిన వారికి వైద్యులు పరీక్షలు నిర్వహించగా... ఈ పరీక్షల్లో 20 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారించారు. అయితే వీరిలో ఎంతమందికి కరోనా స్ట్రెయిన్ (UK COVID-19 strain) ఉందనేది సస్పెన్స్‌గా ఉంది. 20మంది శాంపిల్స్ జీన్ మ్యాప్ రిపోర్టులను సీసీఎంబీ కేంద్రానికి పంపింది. అలాగే తెలంగాణ అధికారులకు సమాచారం అందించింది.
Hyderabad, Dec 28: తెలంగాణలో కొత్త కరోనావైరస్ స్ట్రెయిన్ (New Covid Strain in TS) కలకలం సృష్టిస్తోంది. యూకే నుంచి తెలంగాణకు వచ్చిన వారికి వైద్యులు పరీక్షలు నిర్వహించగా... ఈ పరీక్షల్లో 20 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారించారు. అయితే వీరిలో ఎంతమందికి కరోనా స్ట్రెయిన్ (UK COVID-19 strain) ఉందనేది సస్పెన్స్‌గా ఉంది. 20మంది శాంపిల్స్ జీన్ మ్యాప్ రిపోర్టులను సీసీఎంబీ కేంద్రానికి పంపింది. అలాగే తెలంగాణ అధికారులకు సమాచారం అందించింది.
కరోనా స్ట్రెయిన్‌పై అన్ని రాష్ట్రాల నుంచి కేంద్రానికి రిపోర్టులు చేరుతున్నాయి. కొత్త స్ట్రెయిన్ గురించి వైద్యాధికారులు ఎవరూ మాట్లాడొద్దని కేంద్రం ఆదేశాలిచ్చింది. రేపు సాయంత్రం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేయనుంది. కొత్త కరోనా స్ట్రెయిన్ వైరస్ వచ్చినా టెన్షన్ పడొద్దని వైద్యశాఖ అధికారులు పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే యూకే నుంచి రాష్ట్రానికి వచ్చినవారిలో 154 మంది జాడ ఇప్పటికీ చిక్కడంలేదు. ఈ నెల 9 నుంచి ఇప్పటివరకు మొత్తం 1,216 మంది బ్రిటన్ నుంచి తెలంగాణకు వచ్చారు. ఇందులో చాలా మంది ఆచూకీ లభించగా, ఇంకా 154 మంది జాడ తెలియడం లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయింది. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్ విధానాన్ని అనుసరిస్తున్నది.
యూకే నుంచి వచ్చినవారి వివరాలు సేకరించి, వారి ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నది. ఇప్పటివరకు 970 మందిని గుర్తించి కరోనా పరీక్షలు నిర్వహించగా..వీరిలో శుక్రవారం 16 మందికి, శనివారం ఇద్దరికి, ఆదివారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు చెందిన మరో ఇద్దరికి వైరస్ నిర్ధారణ అయినట్టు వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. దీంతో యుకె కోవిడ్ స్ట్రెయిన్ అనుమానిత కేసుల సంఖ్య 20కి చేరింది.
యూకే నుంచి వచ్చినవారిలో 92 మంది ఇతర రాష్ట్రాల వారు కాగా, ఆ వివరాలను ఆయా ప్రభుత్వాలకు చేరవేశారు. మిగిలిన 154 మంది జాడను పాస్‌పోర్టు ఆధారంగా గుర్తించడం అధికారులకు సవాల్‌గా మారింది. పేర్కొన్న అడ్రస్, ఫోన్ నంబర్లు పాతవి కావడంతో వారిని వెతకడం సాధ్యం కావడం లేదు. యూకే నుంచి వచ్చినవారు లేదా యూకే మీదుగా ప్రయాణించి తెలంగాణకు చేరుకున్నవారు 040–24651119 నంబర్‌లో సంప్రదించాలని, 9154170960 నంబర్‌కు వాట్సాప్ చేయాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.