Hyderabad Weather Updates: హైదరాబాద్ ప్రజలకు హెచ్చరిక.. శుక్రవారం భారీ వర్షం పడే ఛాన్స్!
సాయంత్రానికి కుండపోత వర్షం కురుస్తోంది. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం కూడా హైదరాబాద్‌లో...
నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించడంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా రెండు రోజుల నుంచి మహా నగరం హైదరాబాద్‌లో సాయంత్రం వేళ వర్షం కురుస్తూనే ఉంది. ఉదయం ఎండ దంచి కొడుతున్నా.. సాయంత్రానికి కుండపోత వర్షం కురుస్తోంది. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం కూడా హైదరాబాద్‌లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఇక నగరంలో ఉష్ణోగ్రత విషయానికొస్తే.. కనిష్ఠంగా 24 డిగ్రీలు, గరిష్ఠంగా 33 డిగ్రీలు ఉండనుంది.
కాగా.. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అంచనా వేస్తున్నారు. అలాగే శని, ఆదివారాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అలర్ట్ జారీ చేసింది. యువత కోసం స్పెషల్ డేటింగ్ యాప్ లాంచ్ చేయనున్న జపాన్
ఇదిలా ఉంటే నైరుతి రుతుపవనాల కారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. 6వ తేదీ నుంచి మొదలైన ఈ వర్షాలు 12 తేదీ వరకు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ చెబుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ జిల్లాల్లో ఆవర్తనం ఏర్పడిందని, దాని కారణంగా ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైయస్ఆర్ కడప జిల్లా, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, పిడుగులు కూడా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఇక తెలంగాణ విషయానికొస్తే.. కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్ష సూచనలు కనిపిస్తున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.