Woman Duped by Fake Godman: పూజల గురించి గూగుల్‌లో సెర్చ్ చేసింది! ఏకంగా రూ.47 లక్షలు మోసపోయింది, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చూసి ఫోన్ చేసినందుకు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను నిండా ముంచిన ఫేక్ బాబా
త్వరలోనే నువ్వు చచ్చిపోతావంటూ బెదిరించాడు. ఇందుకోసం స్పెషల్ పూజలు చేయాలంటూ చెప్పాడు. దీనికోసం లక్షల్లో ఖర్చు అవుతుందని చెప్పాడు. దాంతో భయపడ్డ మహిళ విడతల వారిగా రూ. 47 లక్షలు పంపించింది.
Hyderabad, OCT 20: హైదరాబాద్ లో మరో భారీ సైబర్ మోసం (Cyber crime) వెలుగుచూసింది. సైబర్ క్రిమినల్స్ చేతిలో ఓ మహిళ మోసపోయింది. పూజల పేరుతో సైబర్ క్రిమినల్స్ ఓ మహిళ నుంచి రూ.47లక్షలు కాజేశారు. పలు మానసిక సమస్యలతో బాధపడుతున్న ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ (Software Engineer) ఇందుకోసం గూగుల్‌లో సెర్చ్ (Google search) చేసింది. ఈ క్రమంలో ఇన్‌స్టాగ్రామ్‌లో (Instagram) కనిపించిన ఒక యాడ్ ఆమెను ఆకర్షించింది. ఎలాంటి సమస్యలకైనా పరిష్కారం చూపిస్తామంటూ ఇచ్చిన ఆ ప్రకటనలోని ఫోన్ నెంబర్‌కు కాల్ చేసింది. హర్యానాలో ఉండే బాబాగా తనను తాను పరిచయం చేసుకున్న వ్యక్తి...తనకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని నమ్మించాడు. తన జీవితంలో కష్టాలు ఉన్నాయని, అవి తీరాలంటే పూజలు చేయాలంటూ చెప్పాడు. ఇందుకోసం ముందుగా కన్సల్టేషన్ ఫీజు కింద రూ. 32వేలు పంపించాలని కోరాడు. దాంతో ఆమె అతని అకౌంట్ నెంబర్ కు పంపించింది.
ఇక అప్పటి ఆమెతో రెగ్యులర్‌గా టచ్ లో ఉంది. ప్రత్యేక పూజలు చేయాలంటూ లక్షలకు లక్షలు ఆమెతో అకౌంట్ లోకి ట్రాన్స్ ఫర్ చేయించుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా పంపించాడు. ఒక సమయంలో నీపై దుష్టశక్తుల ప్రభావం ఎక్కువగా ఉంది. త్వరలోనే నువ్వు చచ్చిపోతావంటూ బెదిరించాడు. ఇందుకోసం స్పెషల్ పూజలు చేయాలంటూ చెప్పాడు. దీనికోసం లక్షల్లో ఖర్చు అవుతుందని చెప్పాడు. దాంతో భయపడ్డ మహిళ విడతల వారిగా రూ. 47 లక్షలు పంపించింది.
అయితే బాబా (Fake godman) చెప్పినట్లుగా తన జీవితంలో ఎలాంటి మార్పు రాకపోవడంతో అతన్ని సంప్రదించింది. కానీ ఫోన్ ఎంతకూ లిఫ్ట్ చేయలేదు. దాంతో తాను మోసపోయానని గ్రహించిన మహిళ...సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.