Telugu States Weather Update: నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీకి నేడు, రేపు వర్ష సూచన.. తెలంగాణలో పూర్తిగా పొడి వాతావరణమే
దీని ప్రభావంతో ఏపీలోని కోస్తా, సీమ జిల్లాల్లో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Hyderabad, Nov 17: నైరుతి బంగాళాఖాతంలో (Bay of Bengal) ఉపరితల ద్రోణి ఇంకా కొనసాగుతోందని ఐఎండీ (IMD) తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలోని కోస్తా, సీమ జిల్లాల్లో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్నిచోట్ల ఉరుములతో కూడిన వానలు పడుతాయని పేర్కొంది. ఇక తెలంగాణలో పూర్తిగా పొడి వాతావరణమే ఉండనుందని వెల్లడించింది. నవంబర్ 22వ తేదీ వరకు తెలంగాణలో పొడి వాతావరణమే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎలాంటి హెచ్చరికలు లేవని స్పష్టం చేసింది.
ఈ భూమి మీద మానవజాతి అంతరించిపోతే, ఆ ఒక్క జీవే మిగిలి ఉంటుందట.. ఏంటా సంగతి??
ఏపీలో ఈ జిల్లాల్లో వర్షాలు
ఏపీలో నేడు ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరువర్షాలు కురిసే అవకాశం ఉంది. అనంతపురం, సత్యసాయి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
మణిపూర్ సీఎం నివాసంపై దాడి, మరోసారి రణరంగంగా మారిన ఇంఫాల్, సీఎం బిరెన్ సింగ్ సురక్షితం