Imphal, NOV 16: మణిపూర్ రాజధాని ఇంపాల్ లోని (Imphal) సీఎం ఎన్ బీరెన్ సింగ్ వ్యక్తిగత నివాసంపై శనివారం దుండగులు దాడికి ప్రయత్నించారు. దీంతో సీఎం ఇంటి బయట ఉన్న దుండగులపై పోలీసులు టియర్ గ్యాస్ (Tiar Gas) ప్రయోగించారు. ఘటనా సమయంలో సీఎం బీరెన్ సింగ్.. తన ఇంట్లో లేరని అధికార వర్గాలు తెలిపాయి. ఆఫీసులో సురక్షితంగా ఉన్నారని అధికార వర్గాల కథనం. సీఎం బీరెన్ సింగ్ ఇంటిపై దాడి నేపథ్యంలో (Manipur CM's House Under Attack) మణిపూర్ (Manipur) ప్రభుత్వం ఇంపాల్ లో కర్ఫ్యూ విధించింది. ఏడు జిల్లాల పరిధిలో ఇంటర్నెట్ సేవలు తాత్కాలికంగా నిలిపేసింది. జిరిబామ్ జిల్లా పరిధిలో ముగ్గురు వ్యక్తుల హత్యకు న్యాయం చేయాలని కోరుతూ ఆందోళన కారులు నిరసనలకు దిగారు. ఇంపాల్ లోని ఇద్దరు మంత్రులు, ముగ్గురు ఎంఎల్ఏల నివాసాల వద్ద కూడా ఆందోళనకారులు నిరసన తెలిపారు.
Manipur CM's House Under Attack
#Manipur #BirenSingh pic.twitter.com/rvWpQDfgmK
— NDTV (@ndtv) November 16, 2024
24 గంటల్లో హంతకులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇంపాల్ వెస్ట్ జిల్లాలోని సాగోల్ బండ్ ప్రాంతంలోని సీఎం బీరెన్ సింగ్ అల్లుడు – బీజేపీ ఎమ్మెల్యే ఆర్ కే ఇమో ఇంటి ముందు ధర్నా చేశారు. రాష్ట్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సపమ్ రంజన్, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎల్ సుసుంద్రో సింగ్ నివాసాలను లక్ష్యంగా చేసుకుని ఆందోళనకారులు దాడులకు దిగారు.