Viacom18 And Star India Merger Deal: దేశంలోనే అతిపెద్ద మీడియా ఎంటర్ టైన్ మెంట్ సంస్థ ఒప్పందానికి గ్రీన్ సిగ్నల్, వయాకాం-వాల్ట్ డిస్నీ స్టార్ ఇండియా విలీనానికి NCLT ఆమోదం
‘కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ వెస్ట్రన్ రీజియన్ రీజనల్ డైరెక్టర్‌తోపాటు అన్ని పక్షాల న్యాయవాదులు, ప్రతినిధుల సమక్షంలో వయాకాం-స్టార్ ఇండియా (Star India) విలీనంపై అభ్యంతరాలు వెల్లడి కాలేదు.
Mumbai, AUG 30: రిలయన్స్ అనుబంధ వినోద రంగ సంస్థ వయాకాం 18, వాల్ట్ డిస్ట్నీ (Disney) అనుబంధ స్టార్ ఇండియా సంస్థల విలీనానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) ముంబై బెంచ్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఈ ఒప్పందానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) కూడా ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. రెండు సంస్థల విలీనంతో ఏర్పాటయ్యే సంస్థ రూ.70 వేల కోట్లతో దేశంలోనే అతిపెద్ద మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ కానున్నది. ‘కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ వెస్ట్రన్ రీజియన్ రీజనల్ డైరెక్టర్‌తోపాటు అన్ని పక్షాల న్యాయవాదులు, ప్రతినిధుల సమక్షంలో వయాకాం-స్టార్ ఇండియా (Star India) విలీనంపై అభ్యంతరాలు వెల్లడి కాలేదు. ఏ పక్షం కూడా వ్యతిరేకించలేదు’ అని ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ తన ఆదేశాల్లో పేర్కొంది. వాల్ట్ డిస్నీ, స్టార్ ఇండియా విలీనం ఆరు నెలల క్రితమే రెండు సంస్థలు ప్రకటించాయి. ఈ ఒప్పందం ప్రకారం విలీన సంస్థలో రిలయన్స్, దాని అనుబంధ సంస్థలకు 63.16 శాతం, మిగతా 36.84 శాతం వాటా వాల్ట్ డిస్నీకి ఉంటుంది.
వాల్ట్ డిస్నీ- వయాకాం (Viacom18) జాయింట్ వెంచర్ పరిధిలో 120 టీవీ చానెళ్లతోపాటు రెండు స్ట్రీమింగ్ సర్వీసులు నడుస్తాయి. ఈ ఒప్పందం ప్రకారం జాయింట్ వెంచర్ కంపెనీలో రిలయన్స్ రూ.11,500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నది. వినోద రంగంలో సోనీ, నెట్‌ఫ్లిక్స్ సంస్థలకు రిలయన్స్ వయాకాం-వాల్ట్ డిస్నీ జాయింట్ వెంచర్ కంపెనీ గట్టి పోటీ ఇవ్వనున్నదని భావిస్తున్నారు. ఈ జాయింట్ వెంచర్ కంపెనీ చైర్ పర్సన్‌గా రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ, వైస్ చైర్‌పర్సన్‌గా ఉదయ్ శంకర్ ఉంటారు.