Airtel Bharosa Savings Account: ఎయిర్‌టెల్ నుంచి ఉచితంగా రూ.5 లక్షలు ప్రమాద బీమా, బ్యాంకు సేవలు పొందలేని వారికి ఇది నిజంగా శుభవార్తే

భరోసా సేవింగ్స్ అకౌంట్'లో కేవలం నెలవారీ బాలెన్స్‌ 500 రూపాయలతో ఈ ఖాతాను నిర్వహిండచడంతోపాటు, ఐదు లక్షల రూపాయల వ్యక్తిగత ప్రమాద బీమాను ఉచితంగా పొందవచ్చు.

Airtel Payments Bank launches Bharosa Savings Account

New Delhi, September 17: టెలికం రంగంలో దూసుకుపోతున్న ఎయిర్‌టెల్ ( Airtel) పేమెంట్ బ్యాంకింగ్ రంగంలో కూడా తనదైన ముద్రను వేసుకుంటూ వెళుతోంది. కస్టమర్లను ఎప్పటికప్పుడు ఆకర్షించేందుకు కొత్త పథకాలను తీసుకొస్తోంది. మరో దిగ్గజం రిలయన్స్ జియో వైపు తన కస్టమర్లను చేజారిపోనీకుండా కాపాడుకుంటూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే మరో కొత్త ఆవిష్కరణను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చింది.

బ్యాంకింగ్ సేవల్ని పొందలేకపోతున్నవారికి ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ ( Airtel Payments Bank)భరోసా సేవింగ్స్ అకౌంట్ ను ప్రారంభించింది. ఇది అండర్‌ బ్యాంక్ , అన్‌బ్యాంక్ కస్టమర్ల ప్రత్యేకమైన అవసరాలను తీర్చనుందని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. 'భరోసా సేవింగ్స్ అకౌంట్' ( Airtel Bharosa Savings Account ) లో కేవలం నెలవారీ బాలెన్స్‌ 500 రూపాయలతో ఈ ఖాతాను నిర్వహిండచడంతోపాటు, ఐదు లక్షల రూపాయల వ్యక్తిగత ప్రమాద బీమాను ఉచితంగా అందిస్తున్నట్టు తెలిపింది.

ఈ ఖాతా ద్వారా సౌకర్యవంతమైన బ్యాంకింగ్ సేవలను అందించడంతో పాటు, నెలకు ఒక లావాదేవీ ఉచితం. అలాగే భరోసా ఖాతా ద్వారా ప్రభుత్వ రాయితీలు పొందే లేదా, నగదు డిపాజిట్లు చేసే వినియోగదారులు క్యాష్‌బ్యాక్‌ కూడా సదుపాయాన్ని కూడా పొందవచ్చు. భరోసా సేవింగ్స్ అకౌంట్‌ ద్వారా ప్రభుత్వ సబ్సిడీలు పొందే కస్టమర్లకు క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది. బ్యాంక్ అకౌంట్ ద్వారా లావాదేవీలు జరుపుతూ బ్యాంకింగ్ సేవల్ని ఉపయోగించుకునేలా కస్టమర్లను ప్రోత్సహించడమే తమ లక్ష్యమని ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ వెల్లడించింది.

భరోసా సేవింగ్స్‌ అకౌంట్‌ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ సీఎండీ అనుబ్రాతా బిస్వాస్ ఈ సంధర్భంగా తెలిపారు. కొన్ని నెలల పాటు పరిశోధనలు జరిపిన తర్వాత లక్షలాది మంది కస్టమర్లకు బ్యాంకింగ్ సేవలు అందించేందుకు భరోసా సేవింగ్స్ అకౌంట్ ప్రారంభించామని అన్నారు. ఇది ఆర్థికంగా వెనుకబడిన వారి అవసరాలను తీర్చడానికి రూపొందించబడిన వినూత్నమైన, విభిన్నమైన పథకమని పేర్కొన్నారు. భరోసా సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసిన కస్టమర్లు భారతదేశంలోని 6,50,000 ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్-AePS ద్వారా నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు. అలాగే బ్యాలెన్స్ చెక్ చేసుకోవడంతో పాటుగా మినీ స్టేట్‌మెంట్ తీసుకోవచ్చు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif