Contactless Payments Via Smartwatch: ఇకపై ఫోన్ అవసరం లేకుండా మీ స్మార్ట్‌వాచ్ ద్వారా చెల్లింపులు జరపండి, నాయిస్‌తో కలిసి సరికొత్త వాచ్ లాంచ్ చేసిన ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్
తమ చేతికి ఉండే స్మార్ట్‌వాచ్‌ను ట్యాప్ చేస్తూ ఎలాంటి చెల్లింపులనైనా ఇట్టే చేపట్టవచ్చు.ఈ స్మార్ట్‌వాచ్ రూ. 2999కి అందుబాటులో ఉంటుంది.
స్మార్ట్‌వాచ్ ద్వారా చెల్లింపులు చేపట్టేందుకు ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్, నాయిస్, మాస్టర్‌కార్డ్ చేతులు కలిపాయి.ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ కోసం నాయిస్ ఈ స్మార్ట్‌వాచ్‌ను క్రియేట్ చేసింది. తమ చేతికి ఉండే స్మార్ట్‌వాచ్‌ను ట్యాప్ చేస్తూ ఎలాంటి చెల్లింపులనైనా ఇట్టే చేపట్టవచ్చు.ఈ స్మార్ట్‌వాచ్ రూ. 2999కి అందుబాటులో ఉంటుంది.
ఎయిర్‌టెల్ ధ్యాంక్స్ యాప్ నుంచి ప్రస్తుత ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్లు ఈ స్మార్ట్‌వాచ్‌ను కొనుగోలు చేయవచ్చు. నూతన కస్టమర్లు యాప్‌పై డిజిటల్ పద్ధతిలో బ్యాంక్ ఖాతాను తెరిచి నేరుగా స్మార్ట్‌వాచ్‌ను ఆర్డర్ చేయవచ్చు.పేమెంట్ మెషీన్స్‌పై వాచ్ను ట్యాప్ చేయడం ద్వారా పేమెంట్స్ చేయవచ్చు.మాస్టర్‌కార్డ్ నెట్‌వర్క్ ఆధారిత స్మార్ట్‌వాచ్ ద్వారా పలు అవుట్‌లెట్స్, టెర్మినల్స్‌లో కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్ చేపట్టేందుకు వెసులుబాటు ఉంది. భారీ లేఆప్స్, 7500 మంది ఉద్యోగులను తీసేస్తున్న హిందుస్థాన్ యూనిలీవర్, ఐస్ క్రీం యూనిట్ స్వతంత్ర వ్యాపారంగా విడదీస్తున్నట్లు ప్రకటన
ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ స్మార్ట్‌వాచ్‌ని ఎలా యాక్టివేట్ చేయాలి
వినియోగదారులు కేవలం ఒక్క నిమిషంలో థాంక్స్ యాప్ ద్వారా తమ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాకు లింక్ చేయడం ద్వారా వాచ్‌ని యాక్టివేట్ చేయవచ్చు. లింక్ చేసిన తర్వాత, వినియోగదారులు ట్యాప్ అండ్ పే సదుపాయంతో పాయింట్ ఆఫ్ సేల్ (POS) మెషీన్‌లపై వాచ్‌ను ట్యాప్ చేయడం ద్వారా వెంటనే చెల్లింపులు చేయడం ప్రారంభించవచ్చు. ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ స్మార్ట్ వాచ్‌ని ఉపయోగించి కస్టమర్ రోజుకు రూ. 1 నుండి రూ. 25,000 మధ్య చెల్లింపులు చేయగలరు .
స్మార్ట్‌వాచ్ యొక్క NFC చిప్‌కు మాస్టర్ కార్డ్ నెట్‌వర్క్ మద్దతు ఇస్తుంది, NFC చిప్-ప్రారంభించబడిన స్మార్ట్ వాచ్‌లు రిటైల్ అవుట్‌లెట్‌లు, POS టెర్మినల్స్ మరియు అనేక ఇతర టచ్‌పాయింట్‌లలో కాంటాక్ట్‌లెస్ చెల్లింపులకు సజావుగా మద్దతు ఇవ్వడానికి రూపొందించబడ్డాయి, ఆర్థిక లావాదేవీలు చేస్తాయి.
ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ స్మార్ట్‌వాచ్ ఫీచర్లు
నాయిస్ ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ స్మార్ట్‌వాచ్4.69సెంమీ టీఎఫ్టీ ఎల్సీడీ డిస్ ప్లేతో 550 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ కలిగి ఉంది. స్మార్ వాచీ150 క్లౌడ్ ఆధారిత వాచ్ ఫేస్ ల సేకరణకు యాక్సెస్ ను అందిస్తుంది. 130 విభిన్న స్పోర్ట్స్ మోడ్ లకు అనుమతినిస్తుంది. వినియోగదారులను వారి ఒత్తిడిని ట్రాక్ చేసుకోవచ్చు. అలాగే స్ట్రెస్ మానిటర్ కలిగి ఉంది. అలాగే ఆక్సిజన్ లెవల్ చెక్ చేసుకోవచ్చు. హార్ట్ రేట్ చెక్ చేసుకోవచ్చు.