Ashneer Grover Resign: భారత్‌పేకు రాజీనామా చేసిన ఎండీ అష్నీర్ గ్రోవర్, లేఖలో సంచలన ఆరోపణలు చేసిన అష్నీర్
ఫిన్‌టెక్ యూనికార్న్ భారత్‌పే (Unicorn Bharatpe) వ్యవస్థాపకులు అష్నీర్ గ్రోవర్.. తన మేనేజింగ్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. కంపెనీ బోర్డు మెంబర్లు, కీలక పెట్టుదారులతో ఆయనకు నెలకొన్న విభేదాల కారణంగా ఈ నిర్ణయానికి వచ్చినట్లు సదరు సంస్థ వర్గాలు తెలిపాయి.
New Delhi, March 1: ఫిన్‌టెక్ యూనికార్న్ భారత్‌పే (Unicorn Bharatpe) వ్యవస్థాపకులు అష్నీర్ గ్రోవర్.. తన మేనేజింగ్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. కంపెనీ బోర్డు మెంబర్లు, కీలక పెట్టుదారులతో ఆయనకు నెలకొన్న విభేదాల కారణంగా ఈ నిర్ణయానికి వచ్చినట్లు సదరు సంస్థ వర్గాలు తెలిపాయి. సంస్థ అంతర్గత విభేదాల కారణంగా ఎండీ పదవీతో పాటు బోర్డు సభ్యుల డైరెక్టర్(Beard members Director) హోదా నుంచి కూడా తప్పుకున్నట్లు ఆయన తన రాజీనామా(Resignation) లేఖలో స్పష్టం చేశారు.
భారత్ పే ఎండీ అష్నీర్ గ్రోవర్, ఆయన భార్య మాధురీ జైన్‌లపై గత కొంతకాలంగా వృత్తిపరమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలపై అంతర్గత దర్యాప్తునకు కాకుండా.. ప్రైవేట్ ఏజెన్సీలతో దర్యాప్తు చేయిస్తోంది భారత్‌పే. ఈ క్రమంలో.. ఈమధ్యే అష్నీర్ భార్య మాధురీ జైన్‌ను కంపెనీ తప్పించిన విషయం తెలిసిందే. కంపెనీ డబ్బుతో బ్యూటీ ప్రొడక్టులు కొనుక్కోవడంతో పాటు జల్సాలు చేసిందన్న ఆరోపణలను నిజమని తేల్చింది అల్వరెజ్ అండ్ మార్షల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. దీంతో ఆమెను కీలక బాధ్యతల నుంచి తప్పిస్తూ, ఆమె వాటాను సైతం రద్దు చేసేసింది BharatPe. ఇది జరిగిన వారంకే అష్నీర్ తన పదవికి రాజీనామా చేస్తూ కంపెనీని వీడారు.
తనపై వస్తున్న ఆరోపణలను మొదటి నుంచి ఖండిస్తూ వస్తున్న అష్నీర్ గ్రోవర్.. భార్యను తొలగించిన తర్వాత కూడా ఆ ఆరోపణలను తీవ్రస్థాయిలోనే ఖండించాడు. మరోవైపు అష్నీర్ ఆరోపణలను దర్యాప్తు చేయడానికి బయటి ఏజెన్సీలను నియమించడంపై కూడా ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేశాడు. అయితే.. ఒకదాని వెంట ఒకటి ఆయనకు వ్యతిరేక నిర్ణయాలు వస్తుండడంతో.. చివరిగా మధ్యవర్తిత్వం కోసం ఆయన ప్రయత్నించారు. కానీ, కంపెనీ అందుకు సైతం అంగీకరించలేదు. ఈ పరిణామాలతో కలత చెంది కంపెనీ వీడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
సంస్థకు ఆష్నీర్ గ్రోవర్ రాసిన లేఖ సారాంశం
‘నేను స్థాపకుడిగా ఉన్న కంపెనీ నుంచి ఈరోజు బలవంతంగా విడ్కోలు ఇవ్వవలసి వచ్చినందుకు చాలా బాధగా ఉంది. ఫిన్‌టెక్ ప్రపంచంలో అగ్రగామిగా నిలుస్తోందని తల పైకెత్తి గర్వంగా చెబుతున్నాను. 2022లో ప్రారంభం నుండి నా పరువు, ప్రతిష్టలకు భంగం వాటిల్లుతోంది. కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా నాపై, నా కుటుంబంపై నిరాధారమైన ఆరోపణలు చేశారు. అందుకు సాక్ష్యాలు క్రియేట్ చేసి నన్ను టార్గెట్ చేశారు.
భారతీయులు స్టార్టప్ ప్రారంభించి సొంతంగా వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని విజయం సాధిస్తున్నారు. ఎంతో మందికి సంస్థ ప్రేరణగా నిలిచింది. కానీ నేడు నా సొంత కంపెనీ పెట్టబడిదారుల నుంచి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తోంది. వారితో ఒంటరిగా పోరాటం చేస్తున్నాను. ప్రస్తుతం ప్రమాదంలో ఉన్నది నేను కాదు. భారత్‌పే చిక్కుల్లో పడేలా కనిపిస్తోంది. నాకు తెలిసిన వారు, నాతో సన్నిహితంగా పనిచేసిన వ్యక్తులు నన్ను నమ్ముతారు.
అత్యుత్తమ విద్యాసంస్థలైన ఐఐటీ ఢిల్లీ, ఐఐఎం అహ్మదాబాద్‌లో గ్రాడ్యుయేట్ చేశాను. నేను మధ్యతరగతి తల్లిదండ్రుల కడుపున పుట్టాను. వారు నాలో కృషి, చిత్తశుద్ధి, నిజాయితీని నింపారు. రెండు యునికార్న్ వ్యాపారాలను నిర్మించడంలో కీలకపాత్ర పోషించా. Grofers నుంచి BharatPe వరకు ఎంతగానో శ్రమించాను. ఎందరికో ఉగ్యోగావకాశాలు కల్పించారు. నా ఎదుగుదల నాకు మాత్రమే పరిమితం కాకుండా వృత్తిపరంగా మరియు వ్యక్తిగతంగా నాతో అనుబంధం ఉన్న వ్యక్తుల కోసం సహాయం చేశా. దేశంలో స్టార్ట్-అప్ ఎకోసిస్టమ్‌ను ప్రోత్సహించడానికి, అభివృద్ధి చేయడానికి నేను సంపాదించిన దబ్బును ఇన్వెస్ట్ చేశా.
నేను భారత్‌పేని నా బిడ్డలా పెంచి డెవలప్ చేశాను. నా సహ వ్యవస్థాపకుడు, సూపర్ టీంతో దీన్ని నిర్మించాను. చాలా సార్లు పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా వెనకడుకు వేయలేదు. BharatPe UPI స్పేస్‌లో ప్రవేశించింది మరియు PayTM, PhonePe, GooglePay వంటి సంస్థలతో పోటీ పడింది. ‘0% MDR’తో చెల్లింపులకు అంతరాయం కలిగించకూడా చేశాం. చెల్లింపులపై రుణాలు, పోస్ట్ పే, సౌకర్యాలు తీసుకొచ్చాం. నా కృషితో కంపెనీ ఏటా రూ. 100,000 కోట్ల కంటే ఎక్కువ లావాదేవీలు జరిపింది. రూ. 4,000 కోట్ల కంటే ఎక్కువ రుణాలు ఇచ్చే 1 కోటి దుకాణదారుల నెట్‌వర్క్‌ను సృష్టించగలిగాం. లక్షలాది వ్యాపారులకు భారత్‌పే లోన్స్ ఎంతో సహాయం చేశాయి.
వాస్తవం ఏమిటంటే, పెట్టుబడిదారులుగా మీరు నిజాలను నేడు గుర్తించడం లేదు. అసలైన వ్యాపారం ఎలా ఉంటుందో మీరు మర్చిపోయారు. నాపై, నా కుటుంబపై వరుసగా వస్తున్న ఆరోపణల్ని ఇక భరించలేను. సహవ్యవస్థాపకుడిగా కంపెనీని ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టేందుకు ఎంతగానో శ్రమించా. నాపై వ్యతిరేకంగా మీకు ఒక్క ఆధారం కూడా లభించలేదని నాకు తెలుసు. కంపెనీని నడిపించే అతిపెద్ద సవాల్‌ను మీకు వదిలి వెళ్తున్నారు. భారత్‌పే మేనేజింగ్ డైరెక్టర్ పదవికి రాజీనామా తక్షణమే అమలులోకి వస్తుంది. అయితే కంపెనీలో అతిపెద్ద వాటాదారుడిగా కొనసాగుతానని’ అష్నీర్ గ్రోవర్ పలు విషయాలు తన లేఖలో ప్రస్తావించారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)