Nokia 9 PureView: ఐదు కెమెరాలతో నోకియా నుంచి అదిరిపోయే స్మార్ట్‌ఫోన్, నోకియా ప్యూర్‌వ్యూ ప్రత్యేకతలు
దూరానికి అనుగుణంగా Focal length మార్చుకునే వీలున్న 5 కెమెరాల సెటప్ మరియు శక్తివంతమైన క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్ తో Nokia 9 PureView స్మార్ట్ ఫోన్...
మొబైల్ ఫోన్ల దిగ్గజమైన నోకియా చాలాకాలం నుంచి ఊరిస్తూ వస్తున్న Nokia 9 PureView భారత మార్కెట్లో ప్రవేశపెట్టబోతుంది. దూరానికి అనుగుణంగా Focal length మార్చుకునే వీలున్న 5 కెమెరాల సెటప్ మరియు శక్తివంతమైన క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్ ఇందులో ప్రత్యేకత. సెల్ఫీలు, వీడియో చాట్ చేసుకునేందుకు వీలుగా 20 మెగా పిక్సెల్ తో ఫ్రంట్ కెమెరా ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో కూడిన 1440x2960 రెసల్యూషన్ కల క్వాల్ హెచ్‌డీ డిస్‌ప్లే ను అందిస్తున్నారు. అంతేకాకుండా ఎలాంటి వైర్ అవసరం లేకుండానే ఛార్జింగ్ చేసేకునే విధంగా (Wireless Charging) ఒక వినూత్నమైన ఫీచర్ కూడా ఉంది. ఇది వాటర్ రెసిస్టెంట్ మరియు డస్ట్ రెసిస్టెంట్ ఫోన్.
Nokia 9 PureView విశిష్టతలు ఇలా ఉన్నాయి
5.99 ఇంచుల స్క్రీన్, 1440x2960 పిక్సెల్స్ రెసల్యూషన్
12+12+12+12+12 మెగా పిక్సెల్ వెనక కెమెరా, 20 మెగా పిక్సెల్ ముందు కెమెరా
క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్
3320 mAh బ్యాటరీ సామర్థ్యం, వైర్‌లెస్ ఛార్జర్
ర్యామ్ 6 జీబీ, స్టోరేజ్ 128 జీబీ
అండ్రాయిడ్ 9.0 పై (Android 9.0 Pie) ఆపరేటింగ్ సిస్టమ్
ధర, రూ: 12,490/-
ఇండియాలో ఈ ఫోన్ ధర సుమారు రూ. 49,700/-