Flipkart Launches Bus Bookings: ఫ్లిప్‌కార్ట్‌లో బస్‌ టికెట్‌ బుకింగ్‌ సర్వీసు, ఎలాంటి అద‌న‌పు ఛార్జీలు లేకుండానే బుక్ చేసుకోవచ్చని తెలిపిన కంపెనీ

ఆన్‌లైన్‌ ఈకామర్స్‌ దిగ్గజ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ ఆన్‌లైన్‌ బస్‌ టికెట్‌ బుకింగ్‌ సేవలను ప్రారంభించింది. ఈమేరకు రాష్ట్ర రవాణా కార్పొరేషన్లు, ప్రైవేట్‌ సంస్థలతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు కంపెనీలు వర్గాలు తెలిపాయి.

Flipkart launches bus bookings on app

ఆన్‌లైన్‌ ఈకామర్స్‌ దిగ్గజ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ ఆన్‌లైన్‌ బస్‌ టికెట్‌ బుకింగ్‌ సేవలను ప్రారంభించింది. ఈమేరకు రాష్ట్ర రవాణా కార్పొరేషన్లు, ప్రైవేట్‌ సంస్థలతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు కంపెనీలు వర్గాలు తెలిపాయి. అయితే  ప్రస్తుతానికి ఈ సేవలు బెంగళూరు, ఛండీగఢ్‌, ఢిల్లీ, జైపూర్‌, ఇందోర్‌, అహ్మదాబాద్‌, హైదరాబాద్‌, ముంబై, చెన్నైల్లో మాత్రమే అందుబాటులో ఉన్నట్లు కంపెనీ ప్రతినిధులు చెప్పారు. త్వరలో మరిన్ని నగరాలకు దీన్ని విస్తరిస్తామన్నారు.

ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఆన్‌లైన్‌ బస్‌ బుకింగ్‌ ప్లాట్‌ఫామ్‌లు టికెట్‌ ధరతోపాటు ఇతర ఛార్జీలు వసూలు చేస్తున్నాయని తెలిపారు. అయితే కొత్తగా వచ్చిన ఫ్లిప్‌కార్ట్‌ బుకింగ్‌ పోర్టల్‌లో టికెట్‌ కొంటే ఎలాంటి ఛార్జీలు ఉండవని చెప్పారు. కొత్త సేవలు ప్రారంభించిన సందర్భంగా ఏప్రిల్‌ 15 వరకు టికెట్‌ ధరలో 20 శాతం వరకు రాయితీని సైతం పొందవచ్చన్నారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 25 వేలకు పైగా రూట్లలో 10 లక్షలకు పైగా బస్సులను అనుసందానిస్తూ ఈ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివరించారు. వాట్సప్ నుంచి మరో కొత్త ఫీచర్, యూజర్ల స్టేటస్‌లను నోటిఫికేషన్ల రూపంలో పంపించే ఫీచర్ త్వరలో అందుబాటులోకి

దేశవ్యాప్తంగా 25 వేలకు పైగా రూట్లలో 10 లక్షలకు పైగా బస్సులకు సంబంధించిన టికెట్‌ బుకింగ్‌ సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఇప్పటికే విమాన టికెట్‌, హోటల్‌ బుకింగ్‌ సేవలను ఆరంభించిన విషయం తెలిసిందే.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement