Goldman Sachs Layoff: 3200 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న మరో దిగ్గజం, ముంచుకొస్తున్న ఆర్థిక మాంద్యం ముప్పుతో ఈ ఉద్యోగులను తీసేసే పనిలో గోల్డ్‌మాన్ సాచెస్

ముంచుకొస్తున్న ఆర్థిక మాంద్యం ముప్పు వార్తల నేప‌థ్యంలో ప్ర‌పంచంలోనే పేరొందిన గ్లోబ‌ల్ ఫైనాన్సియ‌ల్ స‌ర్వీసెస్‌ సంస్థ గోల్డ్‌మాన్ సాచెస్ గ్రూప్ ఇంక్ 3,200 మందిని (3,200 Employees Starting This Week) ఈ వారంలో ఇంటికి సాగనంపతున్నట్లు (Goldman Sachs Layoff) వార్తలు వస్తున్నాయి

Goldman Sachs (Photo Credit: Twitter)

ఉద్యోగులను పీకేసే బాటలోకి మరో కంపెనీ వచ్చింది. ముంచుకొస్తున్న ఆర్థిక మాంద్యం ముప్పు వార్తల నేప‌థ్యంలో ప్ర‌పంచంలోనే పేరొందిన గ్లోబ‌ల్ ఫైనాన్సియ‌ల్ స‌ర్వీసెస్‌ సంస్థ గోల్డ్‌మాన్ సాచెస్ గ్రూప్ ఇంక్ 3,200 మందిని (3,200 Employees Starting This Week) ఈ వారంలో ఇంటికి సాగనంపతున్నట్లు (Goldman Sachs Layoff) వార్తలు వస్తున్నాయి. ఇప్ప‌టికే రూ. 200 కోట్ల‌కు పైగా న‌ష్టాల‌ను చ‌వి చూస్తున్న ఈ సంస్థ ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోర్ ట్రేడింగ్‌, బ్యాంకింగ్ యూనిట్ల‌లోనూ ఉద్యోగాల్లో ఈ కోత విధించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

దీంతో పాటు ఇన్‌స్టాల్‌మెంట్-లెండింగ్ బిజినెస్‌, క్రెడిట్ కార్డు బిజినెస్‌ల‌ను క‌లిపేయాల‌ని చూస్తున్న‌ట్లు స‌మాచారం అందుతోంది. గోల్డ్‌మాన్ సాచెస్ సీఈవో డేవిడ్ సాల్మ‌న్ మాట్లాడుతూ 2018 చివ‌రి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు సిబ్బంది 34 శాతం పెరిగార‌న్నారు. గ‌తేడాది సెప్టెంబ‌ర్ 30 నాటికి మొత్తం సిబ్బంది సంఖ్య 49 వేలు దాటింది. ఇటీవ‌లి కాలంలో నాన్ ఫ్రంట్ ఆఫీస్ రోల్స్‌తోపాటు డివిజ‌న‌ల్ హెడ్ కౌంట్ కూడా పెరిగింది.

ఉద్యోగాల కోసం లింక్డ్‌ఇన్ బాట పట్టిన వేలాది మంది నిరుద్యోగులు, గ్రూపులు క్రియేట్ చేసి వారికి ఉద్యోగ సలహాలు ఇస్తున్న ఇతర కంపెనీల ఉద్యోగులు, దీంతో భారీ లాభాలను ఆర్జించిన దిగ్గజం

న‌ష్టాల్లో ఉన్నా, ఇప్ప‌టికి కొత్త నియామ‌కాల‌పై ప్ర‌ణాళిక వేస్తున్న‌ట్లు స‌మాచారం. ఈ ఏడాది చివ‌రిలో కొత్త‌గా రెగ్యుల‌ర్ అన‌లిస్ట్ క్లాస్ ఏర్పాటు చేయాల‌ని భావిస్తున్న‌ది. క‌రోనా మ‌హ‌మ్మారి వేళ ప‌నితీరు మెరుగ్గా లేని వారిని కొన‌సాగిస్తూ వ‌చ్చింది. కానీ ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో అటువంటి వారంద‌రినీ సాగ‌నంపేందుకు సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తున్న‌ది. గోల్డ్‌మాన్ సాచెస్ లాభాలు 46 శాతం త‌గ్గాయి. రెవెన్యూ రూపేణా సుమారు 4800 కోట్ల డాల‌ర్ల ఆదాయం ల‌భించింది. 2008 తర్వాత ఈ స్థాయిలో ఉద్యోగాల్లో కోత విధించాల‌ని నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి.