Google Rolls Out Passkeys: గూగుల్ నుంచి అదిరిపోయే న్యూస్, పాస్‌వర్డ్ లేకుండా యాప్స్, వెబ్‌సైట్స్ లాగిన్ అయ్యేలా కొత్త ఫీచర్, పాస్‌కీస్ ఆప్సన్ అందుబాటులోకి..
పాస్‌వర్డ్ లేకుండా యాప్స్, వెబ్‌సైట్స్ లాగిన్ అయ్యేలా సరికొత్త ఫీచర్‌ను విడుదల చేయనుంది.
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సంచలన నిర్ణయం తీసుకుంది. పాస్‌వర్డ్ లేకుండా యాప్స్, వెబ్‌సైట్స్ లాగిన్ అయ్యేలా సరికొత్త ఫీచర్‌ను విడుదల చేయనుంది. ప్రముఖ బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ ఆధారిత ఫింగర్ ప్రింట్స్, ఫేసియల్ రికగ్నైజేషన్, స్క్రీన్ లాక్ పిన్స్ సౌకర్యాన్ని అందిస్తున్న నేపథ్యంలో గూగుల్ కూడా అదే బాటలో పయనిస్తోంది. తాజాగా గూగుల్ అకౌంట్ యూజర్లు పాస్‌వర్డ్ లేకుండా లాగిన్ అయ్యేలా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించింది.
దీని ప్రకారం.. ప్రస్తుతం, ఏదైనా వెబ్‌సైట్, యాప్‌లలో లాగిన్ అవ్వాలంటే యూజర్ ఐడీతో పాటు పాస్‌వర్డ్ 123, పాస్‌వర్డ్ 123@$ ఈ తరహాలో పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ అవసరం లేకుండా బయోమెట్రిక్ అథంటికేషన్ ఆధారిత ‘పాస్‌కీస్’ ఆప్షన్‌తో సంప్రదాయ పాస్‌వర్డ్‌లైన పాస్‌వర్డ్ 123లకు స్వస్తి పలకనుంది.
వచ్చే ఏడాది వరల్డ్ పాస్‌వర్డ్‌డే నాటికి యూజర్లు వినియోగించేలా ఈ పాస్‌కీస్ ఆప్షన్‌ను అందుబాటులోకి తేనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.పాస్‌కీస్ అంటే ఫేస్‌ఐడీ, టచ్ ఐడీ ఆధారిత బయోమెట్రిక్ అథంటికేషన్ విధానం. దీని సాయంతో 123 తరహా పాస్‌వర్డ్‌ల అవసరం ఉండదు. వెబ్ అథింటిక్ ఆధారిత ఫేస్‌ఐడీ లేదా టచ్ ఐడీలను ఉపయోగించి యాప్స్‌లో లేదంటే వెబ్‌సైట్‌లలో లాగిన్ అయ్యేలా సౌకర్యం కలగనుంది.