Bomb Threat to TCS: హైదరాబాద్ టీసీఎస్ సాఫ్ట్‌వేర్ కంపెనీకి బాంబు బెదిరింపు కాల్, అప్రమత్తమైన పోలీసులు, ఫేక్ అని తేలడంతో ఊపిరి పీల్చుకున్న ఉద్యోగులు
TCS (Photo Credits: PTI)

హైదరాబాద్‌లోని టీసీఎస్ సాఫ్ట్‌వేర్ కంపెనీకి బాంబు బెదిరింపు కాల్ వ‌చ్చింది. టీసీఎస్ కంపెనీలో బాంబు పెట్టిన‌ట్లు గుర్తు తెలియని వ్యక్తి కాల్‌ చేశారు దీంతో అప్రమత్తమైన కంపెనీ యాజ‌మాన్యం మాదాపూర్‌ పోలీసుల‌కు స‌మాచారం అందించారు. టీసీఎస్‌ వద్దకు చేరుకున్న పోలీసులు.. ఉద్యోగులను బయటకు పంపించి బాంబ్‌ స్క్వాడ్‌తో కంపెనీలో విస్తృతంగా త‌నిఖీలు నిర్వ‌హించారు. అనంతరం ఫేక్‌ కాల్‌ అని, బాంబు లేద‌ని నిర్ధారించారు.

ఢిల్లీలో బీఆర్‌ఎస్‌ ఆఫీస్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌, 20 వేల చదరపు అడుగుల ప్రాంతంలో భవనం, వీడియో ఇదిగో..

అయితే బాంబు బెదిరింపు ఫోన్ కాల్ చేసిన వ్య‌క్తిని పోలీసులు గుర్తించారు. టీసీఎస్ కంపెనీ సెక్యూరిటీ విభాగంలో పనిచేసిన మాజీ ఉద్యోగి నిర్వాకంగా పోలీసులు తేల్చారు. తనకు తానే పోలీసులకు ఫోన్ చేసి ఫేక్ సమాచారం ఇచ్చినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. దీంతో స‌ద‌రు వ్య‌క్తిని ప‌ట్టుకునేందుకు పోలీసులు య‌త్నిస్తున్నారు. కాగా కంపెనీలో బాంబు లేద‌ని తేల్చ‌డంతో ఇటు ఉద్యోగులు, అటు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.