Aadhaar Card: కేవైసీ నిబంధనల్లో మార్పులు చేసిన ప్రభుత్వం, వలసదారులకు ఊరట, ఇకపై వలసదారులు ఎక్కడినుంచైనా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు
బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయడంలో ఇబ్బంది పడుతున్నారా..అయితే మీకోసం ప్రభుత్వం శుభవార్తను తీసుకువచ్చింది. ఒక ప్రాంతం నుంచి మరో చోటకు మారిన వారు బ్యాంకు ఖాతాను తెరిచేందుకు ఇబ్బంది పడకుండా కేవైసీ నిబంధనల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. వలసదారులు సెల్ఫ్ డిక్లరేషన్ ఫాంతోనే ఖాతాను తెరిచే విధంగా వెలుసుబాటు కల్పించింది.
New delhi, November 15: మీరు వలసదారులా.. బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయడంలో ఇబ్బంది పడుతున్నారా..అయితే మీకోసం ప్రభుత్వం శుభవార్తను తీసుకువచ్చింది. ఒక ప్రాంతం నుంచి మరో చోటకు మారిన వారు (migrants using Aadhaar KYC)బ్యాంకు ఖాతాను తెరిచేందుకు ఇబ్బంది పడకుండా కేవైసీ నిబంధనల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. వలసదారులు సెల్ఫ్ డిక్లరేషన్ ( self-declaration) ఫాంతోనే ఖాతాను తెరిచే విధంగా వెలుసుబాటు కల్పించింది.
ఆధార్‌తో పని లేకుండా స్థానిక చిరునామా కింద నివాస రుజువుగా బ్యాంక్ శాఖలో స్వీయ ప్రకటననను ఇస్తే సరిపోతుందని రెవెన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే తెలిపారు. ఆధార్‌లో తమ స్వస్థలం చిరునామా ఉన్నప్పటికీ ప్రస్తుత చిరునామాతో బ్యాంకు ఖాతా ప్రారంభించాలనుకునేవారికి ఈ నిర్ణయం బాగా సహాయపడుతుంది.
చాలా మందికి ఆధార్( Aadhaar KYC)లో ఒక చిరునామా ఉంటే ప్రస్తుతం ఉంటున్న చిరునామా మరొకటి ఉంటుంది. ఆధార్ కోసం తమ స్వస్థలం చిరునామా ఇచ్చి ఉపాధి కోసం పట్టణాలకు వచ్చి స్థిరపడేవారికి కేవైసీ సమయంలో ఇది సమస్యగా మారింది. అయితే ఇప్పుడు కేంద్రం ఆధార్ కు సంబంధించి కీలక సవరణ చేసింది. దీని ప్రకారం మీరు ఉంటున్న చిరునామా ఆధార్ కార్డులో ఉన్న చిరునామా వేర్వేరుగా ఉన్నప్పటికీ కేవైసీ కోసం ఆధార్ నంబర్ ఇవ్వవచ్చు.
ఆధార్ సంఖ్యనే ఐడీ ఫ్రూఫ్ (Aadhaar KYC use for opening of the bank account)గా ఉపయోగించి కేవైసీ కోసం మీరు ప్రస్తుతం నివాసముంటున్న ఇంచి చిరునామా ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. అయితే ఇలా అడ్రస్ ఫ్రూఫ్ ఇచ్చే వారు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
కేంద్రం నిర్ణయంతో ఇక మీదట ప్రస్తుత లేదా స్థానిక చిరునామా కోసం ఆధార్ లో ఉన్న శాశ్వత చిరునామాను మార్చుకోవాల్సిన అవసరం ఉండదు. ఆధార్ లో శాశ్వత చిరునామా ఉన్నప్పటికీ బ్యాంకు ఖాతాలో ప్రస్తుత చిరునామా ఉంటుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఉపాధి కోసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్లే వారికి ప్రయోజనం చేకూరనుంది.