WhatsApp Chat Lock Feature: వాట్సాప్‌లోకి కొత్తగా చాట్ లాక్ ఫీచర్, యాక్టివేట్ చేసుకోవడం ఎలాగో తెలుసుకోండి
తాజాగా చాట్ లాక్ ఫీచర్‌ను వాట్సాప్ ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ చాట్‌లను యాప్‌లో సీక్రెట్‌గా దాచుకోవచ్చు. తద్వారా ఆయా చాట్‌లను ఎవరూ యాక్సెస్ పొందలేరు.
ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సరికొత్త ఫీచర్లను యూజర్ల కోసం అందిస్తూ ఉంటుంది. తాజాగా చాట్ లాక్ ఫీచర్‌ను వాట్సాప్ ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ చాట్‌లను యాప్‌లో సీక్రెట్‌గా దాచుకోవచ్చు. తద్వారా ఆయా చాట్‌లను ఎవరూ యాక్సెస్ పొందలేరు.
ఈ కింద సూచించిన స్టెప్స్ అనుసరించి ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు
1. ఎవరి చాట్‌ను సీక్రెట్‌గా దాచాలనుకుంటున్నారో వారి కాంటాక్ట్ ప్రొఫైల్‌లోకి వెళ్లాలి.
2. కాంటాక్ట్ మీద ట్యాప్ చేస్తే ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది. కిందికి స్క్రోల్ చేస్తే ‘చాట్ లాక్’ ఆప్షన్ కనిపిస్తుంది. దానిని ఆన్ చేయాలి.
3. ‘చాట్ లాక్’ ఆన్ చేస్తే ఆటోమేటిక్‌గా ఇద్దరి మధ్య సంభాషణ యాప్‌లో లాక్ అవుతుంది.
4. తిరిగి ఆ చాట్‌ను చదవాలనుకుంటే అన్‌లాక్ చేస్తే సరిపోతుంది.
5. చాటింగ్ లాక్ అయ్యాక యాప్ పైభాగంలో ‘లాక్డ్ చాట్’ ఆప్షన్ కనిపిస్తుంది. దానిని అన్ లాక్ చేసి చదువుకోవచ్చు.
5జీ రాకముందే 6జీని సిద్ధం చేసిన జపాన్, 500 రెట్లు వేగంతో ప్రపంచంలోనే మొట్టమొదటి 6జీ పరికరం అభివృద్ధి
అంతేకాదు.. లాక్ చేసిన చాట్‌ను కూడా పూర్తిగా ఎవరికీ కనిపించకుండా దాచడానికి కూడా కొత్త ఫీచర్‌ను వాట్సప్ పరిచయం చేసింది. ఈ స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుంది..
1. తొలుత కాంటాక్ట్‌ను చాట్ లాక్ చేయాల్సి ఉంటుంది.
2. వాట్సాప్ హోమ్ పేజీలో చాట్స్ పైభాగంలో ‘లాక్ చాట్స్’ ఆప్షన్ కనిపిస్తుంది.
3. దానిపై ట్యాప్ చేసి లాక్డ్ చాట్స్ విభాగంలో ఎగువ కుడి వైపున మూడు చుక్కలు కనిపిస్తాయి.
4. ఈ చుక్కలపై ట్యాప్ చేస్తే చాట్ లాక్ సెట్టింగ్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
5. ‘హైడ్ లాక్డ్ చాట్స్’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిని ‘ఎనేబుల్’ చేయాలి.
6. ఎనేబుల్ చేయగానే సీక్రెట్ కోడ్ ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది. సీక్రెడ్ కోడ్‌ని ఎంటర్ చేయాలి.
7. సూచించిన స్టెప్స్ అని అనుసరిస్తే హోమ్ పేజీలో ‘లాక్డ్ చాట్స్’ ఆప్షన్ కనిపించదు.
ఇక లాక్ చేసిన చాట్‌లను ఓపెన్ చేయడానికి చాట్ లాక్ సెట్టింగ్‌లలో సీక్రెట్ కోడ్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్‌గా చాట్స్ కనిపిస్తాయి.