Team India Watch Chandrayaan 3 Launch: చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్‌ను వీక్షించిన టీమిండియా సభ్యులు, జయహో ఇస్రో అంటూ ఇండియన్ క్రికెటర్స్ సంబురాలు
చంద్రుడిపై ల్యాండర్ సేఫ్ ల్యాండైన వెంటనే క్రికెటర్లు చప్పట్లతో తమ ఆనందాన్ని తెలియజేశారు. మరికాసేపట్లో ఐర్లాండ్‌తో టీమ్ఇండియా మూడో టీ20 మ్యాచ్ ఆడనుంది. అయినప్పటికీ చంద్రయాన్-3 ప్రయోగాన్ని వీక్షించడం విశేషం.
New Delhi, AUG 23: అంతరిక్ష రంగంలో భారత్ సరికొత్త చరిత్ర (Chandrayaan 3 Launch)సృష్టించింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్ (Vikram) ల్యాండర్ సురక్షితంగా దిగింది. దీంతో దేశ వ్యాప్తంగా ఇస్త్రో శాస్త్రవేత్తపై ప్రశంసల వర్షం కురుస్తోంది. బీసీసీఐ, భారత కెప్టెన్ రోహిత్ శర్మ, సిరాజ్, తదితరులు చంద్రయాన్-3 సక్సెస్‌పై (Chandrayaan 3 Launch) సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేయడంతో పాటు ఇస్రో శాస్త్రవేత్తల కృషిని కీర్తి కొనియాడుతున్నారు. ఈ క్రమంలో బీసీసీఐ ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో భారత క్రికెటర్లు (Indian Cricketers) చంద్రయాన్-3 ప్రయోగాన్ని వీక్షిస్తున్నారు. చంద్రుడిపై ల్యాండర్ సేఫ్ ల్యాండైన వెంటనే క్రికెటర్లు చప్పట్లతో తమ ఆనందాన్ని తెలియజేశారు.
మరికాసేపట్లో ఐర్లాండ్‌తో టీమ్ఇండియా మూడో టీ20 మ్యాచ్ ఆడనుంది. అయినప్పటికీ చంద్రయాన్-3 ప్రయోగాన్ని వీక్షించడం విశేషం.
ఇక మ్యాచ్ విషయానికి మూడు మ్యాచుల టీ20 సిరీస్‌లో (T20) భాగంగా నామమాత్రమైన మూడో టీ20 మ్యాచ్ డబ్లిన్ వేదికగా మరికొద్దిసేపటిలో ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి భారత జట్టు సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోండగా సంచలనం సృష్టించాలని ఐర్లాండ్ పట్టుదలగా ఉంది.