Infinix Smart 8 Plus: కేవలం రూ. 7 వేలకే ఇన్ఫినిక్స్ స్మార్ట్‌ఫోన్‌, దీనిలోని ఫీచర్లు మాత్రం ఎంతో ఘనం, ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ప్లస్‌ పేరుతో లాంచ్ అయిన ఈ మొబైల్ ప్రత్యేకతలు ఏమిటో ఇక్కడ తెలుసుకోండి!

Infinix Smart 8 Plus Smartphone | Photo: X

Infinix Smart 8 Plus Smartphone: ఇన్ఫినిక్స్ కంపెనీ తమ బ్రాండ్ నుంచి మరొక ఎంట్రీలెవెల్ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. 'ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ప్లస్‌' పేరుతో లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్‌ సరసమైన ధరలోనే అద్భుతమైన ఫీచర్లను అందిస్తుంది. ఈ ఫోన్‌లో వేగవంతమైన పనితీరు కనబరిచే G36 2.2 GHz ఆక్టా-కోర్ ప్రాసెసర్, 50-మెగాపిక్సెల్ వెనుక కెమెరాతో పాటు 128GB స్ట్రోరేజ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీని బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా మెరుగ్గా ఉంది. అదనంగా, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేషియల్ రికగ్నిషన్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఈ స్మార్ట్‌ఫోన్ ఒకే 4GB RAM+128GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్ గల ఏకైక వేరియంట్లో అందుబాటులో ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్‌తో స్టోరేజ్ సమస్య ఉండదు, ఎందుకంటే ఇది 128 GB అంతర్గత నిల్వను అందిస్తుంది, మైక్రో SD ద్వారా 2TB వరకు విస్తరించవచ్చు.  ఇది గెలాక్సీ వైట్, టింబర్ బ్లాక్ మరియు షైనీ గోల్డ్ అనే మూడు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్‌లలో లభ్యమవుతుంది.

కొత్త Infinix Smart 8 Plus స్మార్ట్‌ఫోన్‌లో ఇంకా ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి? ధర ఎంత? తదితర విషయాలను ఈ కింద తెలుసుకోండి.

Infinix Smart 8 Plus స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

కనెక్టివిటీ కోసం.. డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 802.11 ac, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, బ్లూటూత్ 5, GPS + GLONASS , USB టైప్-C, DTS ఆడియో సపోర్ట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌ను కలిగి ఉంది.

ధర: రూ. 7,799/-

అయితే ప్రారంభోత్సవ ఆఫర్ లో భాగంగా వివిధ బ్యాంక్ హోల్డర్లకు రూ. 800 డిస్కౌంట్ లభిస్తుంది. కాబట్టి ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.6,999/- కే కొనుగోలు చేయవచ్చు. Infinix Smart 8 Plus  స్మార్ట్‌ఫోన్‌ మార్చి 9 నుండి ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.