Infosys Ends Work From Home: నెలలో 10 రోజులు ఆఫీసుకు రావాల్సిందే, వర్క్ ఫ్రం హోంపై ఇన్ఫోసిస్ కీలక ప్రకటన
వర్క్ ఫ్రం హోమ్ విషయంలో దేశీ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కీలక ప్రకటన చేసింది.కింది స్థాయి ఉద్యోగులు ప్రతి నెలా కనీసం పది రోజుల పాటు కార్యాలయానికి తిరిగి రావాలని ఇన్ఫోసిస్ తన పని విధానంలో గణనీయమైన మార్పును చేస్తోంది.
వర్క్ ఫ్రం హోమ్ విషయంలో దేశీ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కీలక ప్రకటన చేసింది.కింది స్థాయి ఉద్యోగులు ప్రతి నెలా కనీసం పది రోజుల పాటు కార్యాలయానికి తిరిగి రావాలని ఇన్ఫోసిస్ తన పని విధానంలో గణనీయమైన మార్పును చేస్తోంది. రిటర్న్-టు-ఆఫీస్ (RTO) విధానాన్ని బలోపేతం చేయడానికి మరియు హైబ్రిడ్ వర్క్ మోడల్‌ను స్వీకరించడానికి ఇన్ఫోసిస్ యొక్క వ్యూహంలో ఈ చర్య భాగం.
దీని ప్రకారం.. ఇప్పటివరకూ ఇంట్లోంచే విధులు నిర్వర్తిస్తున్న వారు ఇకపై నెలకు కనీసం పది రోజులపాటు ఆఫీసులకు రావాల్సి ఉంటుంది.ఎంట్రీ లెవెల్ నుంచి మధ్య స్థాయి ఉద్యోగులందరికీ ఇది వర్తిస్తుందని ప్రకటించింది. ఈ సమాచారాన్ని ఇప్పటికే ఈమెయిళ్ల ద్వారా ఉద్యోగులకు తెలియజేసినట్లు తెలిపింది.
బ్యాండ్ 5, 6 స్థాయుల్లో పనిచేస్తున్న ఉద్యోగుల (మిడ్-లెవల్ మేనేజర్‌లు, ప్రాజెక్ట్ హెడ్‌లు, ఎంట్రీ-లెవల్ ఉద్యోగులు)కు నెలలో 10 రోజులు కార్యాలయం నుంచి పని చేయాలని మెయిల్ పంపారు. నవంబర్ 20, 2023 నుండి నెలకు కనీసం పది రోజులు కార్యాలయంకు రావాల్సిందేనని తెలిపింది.
ఇక టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఇటీవల వర్క్ ఫ్రం ఆఫీస్‌కే మొగ్గు చూపింది. దీనివల్ల సంస్థ అసోసియేట్‌లు, కస్టమర్‌ల మధ్య పరస్పర అవగాహన ఏర్పడుతుందని టీసీఎస్ భావిస్తోంది. సంస్థ ఉత్పత్తులను కస్టమర్‌లకు డెలివరీ చేయాలన్నా, వర్క్ అవుట్‌పుట్ మెరుగుపడాలన్నా వర్క్‌ఫ్రం ఆఫీస్ ద్వారానే సాధ్యం అని చెప్పింది.