iPhone 17 Leaks: ఐఫోన్ 17 సిరీస్‌ ఫోన్లు లీక్, 24 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో రానున్నట్లుగా వార్తలు, స్లిమ్ అండ్ అల్యూమినియం డిజైన్‌తో ఆపిల్ కొత్త ఫోన్

ఆపిల్ తన తాజా ఐఫోన్ 16 లైనప్‌ను ప్రకటించడానికి ముందే ఐఫోన్ 17 ఫోన్‌కు సంబంధించిన లైనప్ ప్లాన్స్ లీకయ్యాయి.రిఫ్రెష్ లుక్, ఫ్రంట్ కెమెరాను మరింత మెరుగు పరచడంతో పాటు కొద్దిపాటి డైనమిక్ ఐలండ్‌తో రావొచ్చని లీకులు వెల్లడించాయి.

Apple Logo, iPhone Design Representation (Photo Credit: Unsplash)

ఆపిల్ తన తాజా ఐఫోన్ 16 లైనప్‌ను ప్రకటించడానికి ముందే ఐఫోన్ 17 ఫోన్‌కు సంబంధించిన లైనప్ ప్లాన్స్ లీకయ్యాయి.రిఫ్రెష్ లుక్, ఫ్రంట్ కెమెరాను మరింత మెరుగు పరచడంతో పాటు కొద్దిపాటి డైనమిక్ ఐలండ్‌తో రావొచ్చని లీకులు వెల్లడించాయి. హైటాంగ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీస్ అనలిస్ట్ జెఫ్ పు ఇన్వెస్టర్ నోట్ ప్రకారం.. ఐఫోన్ 17 సిరీస్‌ను ఈసారి స్లిమ్‌గా తీసుకురావాలని యోచిస్తోంది.

ఐఫోన్ 17 సిరీస్‌లో నాలుగు వేరియంట్లు ఉంటాయని సమాచారం. ప్లస్ వేరియంట్‌ను మాత్రం స్లిమ్‌గా తీర్చిదిద్దుతోంది. ఐఫోన్ 17, ఐఫోన్ 17 స్లిమ్, ఐఫోన్ 17 ప్రొ మోడళ్లు అల్యూమినియం డిజైన్‌తో వచ్చే అవకాశం ఉంది. ఐఫోన్ 17 ప్రొ మ్యాక్స్‌ను మాత్రం టైటానియం నిర్మాణాన్ని కలిగి ఉంటుందని సమాచారం. బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్‌గా iPhone 15 Pro Max, రెండవ బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్‌గా Samsung Galaxy S24 సిరీస్

ఐఫోన్ 17 సిరీస్ స్పెసిఫికేషన్లు: ఐఫోన్ 17, ఐఫోన్ 17 స్లిమ్ వేరియంట్లు 8 జీబీ ర్యామ్‌తో ఏ18, లేదంటే ఏ19 బయోనిక్ చిప్‌సెట్‌తో వచ్చే అవకాశం ఉంది. ఐఫోన్ 17 ప్రొ, ఐఫోన్ 17 ప్రొ మ్యాక్స్ 12 జీబీ ర్యామ్, ఏ 19 ప్రొ చిప్‌సెట్‌తో రానున్నాయి. ఐఫోన్ 17 సిరీస్‌లో 24 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉపయోగించనున్నారు. ఐఫోన్ 15 సిరీస్‌లో 12 ఎంపీ కెమెరాను మాత్రమే ఉపయోగించారు. ఇందులో దానిని డబుల్ చేస్తున్నారు.

ఐఫోన్ 17 సిరీస్ లీక్ వివరాలు

ఐఫోన్ 17

6.1 అంగుళాల డిస్‌ప్లే

ఐఫోన్ 17 స్లిమ్

6.6 అంగుళాల డిస్‌ప్లే

ఐఫోన్ 17 ప్రొ

6.3 అంగుళాల డిస్‌ప్లే

ఐఫోన్ 17 ప్రొ మ్యాక్స్

6.9 అంగుళాల డిస్‌ప్లే

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

US Illegal Indian Immigrants Return: అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను ఇండియాకు పంపిన ట్రంప్, 104 మందితో అమృత్‌సర్ చేరుకున్న విమానం

US Begins Deportation of Indian Migrants: అక్రమ వలసదారులపై ట్రంప్ సర్కారు కొరడా, భారతీయులను వెనక్కి పంపుతున్న అగ్రరాజ్యం, దాదాపు 18 వేల మంది భారతీయులు అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నట్లుగా వార్తలు

Reign Of Titans: భారత్‌లో ఇకపై ఆ గేమ్‌ ఆడొచ్చు, అన్ని అడ్డంకులను అధిగమించిన రీన్స్‌ ఆఫ‌ టైటాన్స్, అంతర్జాతీయస్థాయి పోటీల్లోనూ పాల్గొనవచ్చని సంస్థ ప్రకటన

Samsung Galaxy S25, Galaxy S25 Plus Launched: శాంసంగ్‌ ఫోన్ అభిమానులకు ఇక పండుగే! గెలాక్సీ S25 సిరీస్‌ ఫోన్లు లాంచ్‌ చేసిన సంస్థ, ధర, పూర్తి స్పెసిఫికేషన్స్‌ ఇవిగో

Share Now