Reliance Jio: జియోకు తొలిసారిగా పెద్ద షాక్, ఒక్క నెలలో 1.9 కోట్ల సబ్‌స్క్రైబర్లను కోల్పోయిన రిలయన్స్ జియో, కొత్తగా 2.75 లక్షల యాక్టివ్ యూజర్లను సొంతం చేసుకున్న భారతీ ఎయిర్‌టెల్
సెప్టెంబర్‌లో జియో నెట్‌వర్క్ 1.9 కోట్ల సబ్‌స్క్రైబర్లను (Jio loses 1.9 crore users in September) కోల్పోయింది. ఇప్పటికే నష్టాల్లో చిక్కుకున్న వొడాఫోన్ ఐడియా 10.8 లక్షల కస్టమర్లను నష్టపోయింది.
టెలికం దిగ్గజం రిలయన్స్ జియోకు తొలిసారి షాక్ తగిలింది.సెప్టెంబర్‌లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సెప్టెంబర్‌లో జియో నెట్‌వర్క్ 1.9 కోట్ల సబ్‌స్క్రైబర్లను (Jio loses 1.9 crore users in September) కోల్పోయింది. ఇప్పటికే నష్టాల్లో చిక్కుకున్న వొడాఫోన్ ఐడియా 10.8 లక్షల కస్టమర్లను నష్టపోయింది. దీనికి భిన్నంగా భారతీ ఎయిర్‌టెల్‌కు కొత్తగా సుమారుగా 2.75 లక్షల యాక్టివ్ యూజర్లు (Bharti Airtel adds 2.74 lakh subscribers) జత కలిశారని ట్రాయ్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఇదే నెలలో వొడాఫోన్ ఐడియా 10.7 లక్షల వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్లను కోల్పోయింది. ఇది వరుసగా 11వ నెల కూడా వొడాఫోన్ తన కస్టమర్లను నష్టపోయింది. కానీ, ఎయిర్‌టెల్ వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్లలో 0.08 శాతం మార్కెట్ వాటా పొందితే, జియో యూజర్ బేస్ 4.29 శాతం తగ్గింది. మొత్తం వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్లు 1.18 బిలియన్ల నుంచి సెప్టెంబర్ నాటికి 1.16 బిలియన్లకు పడిపోయింది. సెప్టెంబర్‌లో మొత్తం వైర్‌లెస్ కస్టమర్లు 1.74 శాతం తగ్గాయి.
ఎయిర్‌టెల్ యూజర్లకు అలర్ట్, టారిఫ్ ధరలు పెరిగాయి, పెరిగిన ధరలు నవంబర్ 26 నుంచి అమల్లోకి..
ఆగస్టులో 35.41 కోట్ల మంది వినియోగదారులు కలిగివున్న ఎయిర్‌టెల్.. సెప్టెంబర్ చివరినాటికి 35.44 కోట్లకు చేరుకున్నారు. దేశంలో అతిపెద్ద టెలికం ఆపరేటర్ రిలయన్స్ జియో 1.90 కోట్ల మంది సబ్‌స్ర్కైబర్లను కోల్పోయి 42.48 కోట్లకు తగ్గారు. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వొడాఫోన్ ఐడియా నెట్‌వర్క్‌ను 10.77 లక్షల మంది వదులుకున్నారు. దీంతో మొత్తం కస్టమర్ల సంఖ్య 26.99 కోట్లకు పరిమితమయ్యారు.