Juice Jacking: పబ్లిక్ ప్లేసుల్లో మొబైల్ చార్జింగ్ పెడుతున్నారా? అయితే మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ అవ్వడం ఖాయం, చార్జింగ్ పాయింట్ల ద్వారా ఫోన్లలోకి వైరస్ చొప్పిస్తున్న హ్యకర్లు, సరికొత్త ప్రక్రియ ద్వారా హ్యాకింగ్
(పాత Android వెర్షన్‌లు రన్ అయ్యే డివైజ్‌ల్లో తప్ప) మీరు మీ డివైజ్‌లో మాన్యువల్‌గా అనుమతించాల్సి ఉంటుంది. తద్వారా మాత్రమే ఫైల్ ట్రాన్స్‌ఫర్ అనుమతించగలరు. మీరు మీ ఫోన్‌ని మీ కంప్యూటర్‌లోకి ప్లగ్ చేసినప్పుడు.. మీరు ఫైల్‌లను షేర్ చేయాలనుకుంటే మీకు ప్రాంప్ట్ వస్తుంది
Punjab, OCT 12: పబ్లిక్ స్టేషన్లలో మీ మొబైల్ ఫోన్లకు ఛార్జింగ్ (Charging your phone in public ) పెడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. మీ విలువైన డేటా హ్యాకర్లకు (Hackers) చిక్కే ప్రమాదం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టరాదు. ప్రయాణ సమయాల్లో స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ ఛార్జింగ్ (Charging) వంటి సమస్యలతో తరచుగా ఇబ్బంది పడుతుంటారు. ఎక్కడైనా ఛార్జింగ్ పాయింట్‌లను ఉన్నాయో కనుగొనేందుకు ప్రయత్నిస్తుంటారు. అత్యవసర పరిస్థితుల్లో ఛార్జింగ్ పాయింట్లను చూడవచ్చు. కొన్నిసార్లు పబ్లిక్ స్టేషన్లలో (Public stations) కనిపించే ఛార్జింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని పంజాబ్ పోలీసులు మొబైల్ ఫోన్ వినియోగదారులను హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ఛార్జింగ్ పాయింట్ల నుంచి స్మార్ట్‌ఫోన్‌లను యాక్సెస్ చేసేందుకు హ్యాకర్లకు అనుమతిస్తాయని, తద్వారా మీ డేటాను తస్కరించే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
USBతో మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పోర్ట్‌లలో హ్యాకర్లు మాల్వేర్‌ను లోడ్ చేస్తారు లేదా USB పోర్ట్‌ను మారుస్తారు. ఛార్జింగ్ కోసం పోర్ట్‌కి కనెక్ట్ చేసిన ఫోన్‌లకు యాక్సెస్ చేసేందుకు మరొక వైపు USB కేబుల్‌ను కనెక్ట్ చేస్తారు. మీ ఫోన్ ఛార్జింగ్ అయ్యే సమయంలో హ్యాకర్లు మీ ఫోన్‌కు వైరస్‌లు లేదా మాల్వేర్‌లను ఇంజెక్ట్ చేస్తారు. మీ ఫోన్‌ను ట్రాక్ చేస్తాయి. దాంతో మీ సీక్రెట్ డేటాను దొంగలించే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియను జ్యూస్ జాకింగ్ అంటారు. ఈ జ్యూస్ జాకింగ్ గురించి ఒడిశా పోలీసులు అక్కడి ప్రజలను అలర్ట్ చేశారు. ‘మొబైల్ ఛార్జింగ్ స్టేషన్లు, USB పవర్ స్టేషన్లు మొదలైన బహిరంగ ప్రదేశాలలో మీ మొబైల్‌లను ఛార్జ్ చేయవద్దు. సైబర్ మోసగాళ్ళు (Cyber Criminals) మీ మొబైల్ నుంచి మీ వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించే అవకాశం ఉంది. మీ ఫోన్‌లో మాల్వేర్‌లను ఇన్‌స్టాల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు’ అని ట్విట్టర్ పోస్ట్‌లో తెలిపారు.
జ్యూస్ జాకింగ్.. ఎలా పనిచేస్తుందో చూద్దాం. మీరు ఐఫోన్, ఆండ్రాయిడ్ లేదా మరేదైనా స్మార్ట్‌ఫోన్ వినియోగదారు అయితే.. అన్ని డివైజ్‌ల్లో సాధారణంగా కనిపించేది ఒకటే.. ఫోన్ కేబుల్ ద్వారా ఛార్జ్ అవుతుంది. వివిధ రకాల పోర్ట్‌లు అందుబాటులో ఉన్నాయి. ఛార్జింగ్ కేబుల్ ద్వారా ఛార్జింగ్ ఒకే విధంగా ఉంటుంది. మీరు USB ఛార్జింగ్ పోర్ట్‌ను చూస్తే.. మీ పవర్ అడాప్టర్‌ని ప్లగ్ చేసేందుకు సాధారణ ఎలక్ట్రికల్ స్విచ్ లేకుంటే మీరు అప్రమత్తంగా ఉండండి. USB ఛార్జింగ్ పోర్ట్‌లు మీ ఫోన్‌ని హ్యాకర్లు సెటప్ చేసిన వేరే డివైజ్‌కు కనెక్ట్ చేస్తారు. మీరు ఆ USB కనెక్టర్‌కు మీ డివైజ్ ప్లగ్ ఇన్ చేసిన వెంటనే.. మీ ఫోన్ వైరస్‌లు (Virus) లేదా డేటా చోరీకి గురవుతుంది. ఛార్జింగ్ ప్రక్రియలో హ్యాకర్‌లు మీ డివైజ్ యాక్సెస్ చేస్తారు. ఈ USB పోర్ట్‌ల ద్వారా మీ డివైజ్ హ్యాక్ అయిన విషయం కూడా మీకు తెలియదని గమనించాలి.
చాలా స్మార్ట్‌ఫోన్‌లలో డేటా ట్రాన్స్‌ఫర్ డిఫాల్ట్‌గా నిలిచిపోయి ఉంటుంది. (పాత Android వెర్షన్‌లు రన్ అయ్యే డివైజ్‌ల్లో తప్ప) మీరు మీ డివైజ్‌లో మాన్యువల్‌గా అనుమతించాల్సి ఉంటుంది. తద్వారా మాత్రమే ఫైల్ ట్రాన్స్‌ఫర్ అనుమతించగలరు. మీరు మీ ఫోన్‌ని మీ కంప్యూటర్‌లోకి ప్లగ్ చేసినప్పుడు.. మీరు ఫైల్‌లను షేర్ చేయాలనుకుంటే మీకు ప్రాంప్ట్ వస్తుంది. అదేవిధంగా, సెక్యూరిటీ కోసం విమానాశ్రయాలు, మెట్రో, రైల్వే స్టేషన్లు లేదా ఇతర ప్రదేశాలలో పబ్లిక్ ఛార్జింగ్ పోర్ట్‌లను ఉపయోగిస్తున్నప్పుడు మీకు ఆ ప్రాంప్ట్ మెసేజ్ వస్తే.. ఆ ప్రాంప్ట్‌ను తిరస్కరించాలని పోలీసులు వినియోగదారులకు సూచిస్తున్నారు.