5G Representational Image (Photo Credits: Twitter)

ఫాస్టెస్ట్‌ 5జీ నెట్‌ వర్క్‌ దేశంలోకి అందుబాటులోకి రావడంతో సైబర్‌ నేరగాళ్లు దీన్ని ఆసరా చేసుకుని రెచ్చిపోతున్నారు. 4జీ నుంచి 5జీ అప్‌గ్రేడ్‌ పేరుతో లింకులు క్రియేట్ చేసి కస్టమర్ల నుండి భారీ స్థాయిలో డబ్బును కొల్లగొడుతున్నారు. స్మార్ట్‌ఫోన్‌ను 5జీకి వెంటనే అప్‌గ్రేడ్‌ చేసుకోవాలంటూ ఈ హ్యకర్లు పలువురికి ఫోన్లు చేస్తూ.. ఓటీపీ చెప్పాలని కోరుతున్నారు.

వీరంతా యూపీఐ, బ్యాంకు యాప్‌లకు అనుసంధానం అయిన మొబైల్‌ నంబర్ల ద్వారా ఖాతాల్లోకి చొరబడే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టెక్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 4జీ నుంచి 5జీకి అప్ గ్రేడ్‌ అవ్వాలని వచ్చే ఏ మెసేజ్‌ను నమ్మొద్దు చెబుతున్నారు.

లోన్‌ యాప్స్‌ ఏజెంట్లు వేధిస్తే వెంటనే 1930కి కాల్ చేయండి, టోల్‌ ఫ్రీ నంబర్‌ 1930ను విడుదల చేసిన ఏపీ రాష్ట్ర హోంశాఖ

ఫోన్‌ను అప్‌గ్రేడ్‌ చేసుకోవాలనుకుంటే సంబంధిత టెలికం సంస్థ కార్యాలయంలో 5జీ అప్‌గ్రేడేషన్‌ చేసుకోవాలని,ఫేక్‌ లింకులను క్లిక్‌ చేసి ఆర్థిక మోసాలకు, డేటా చౌర్యానికి గురికావద్దని అంటున్నారు. 5జీ పేరుతో ఫేక్‌ లింకులు వస్తున్నాయని, అనుమానం ఉంటే తక్షణమే స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని పోలీసులు సైతం సామాన్యుల్లో చైతన్యం కల్పిస్తున్నారు.