Online Payments Charges: ఆన్‌లైన్ మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారా.. అయితే వివిధ బ్యాంకుల్లో చార్జీలు తప్పక తెలుసుకోవాలి, ఏటీఎం లావాదేవీలకు పడే ఛార్జీలు, మినిమమ్ బ్యాలెన్స్ లేకుంటే పడే ఛార్జీల గురించి కూడా ఓ సారి తెలుసుకోండి
వివిధ బ్యాంకుల్లో చార్జీలు పలు రకాలుగా ఉన్నాయి. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (ఎన్ఈఎఫ్టీ) (National Electronic Funds Transfer (NEFT) ఆప్షన్ దాదాపు అన్ని ప్రధాన బ్యాంకుల్లో సమానంగా ఉన్నాయి.
ప్రస్తుతం ప్రతి ఒక్కరికీ బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరి అయింది. బ్యాంక్‌లో ఖాతా కలిగి ఉండటం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు పొందవచ్చు. ప్రభుత్వాలు అందించే స్కీమ్స్ బెనిఫిట్స్ పొందొచ్చు. అంతేకాకుండా బ్యాంక్ ఖాతాలోని డబ్బులపై వడ్డీ కూడా వస్తుంది. అయితే బ్యాంక్ అకౌంట్ వల్ల ప్రయోజనాలు మాత్రమే కాకుండా ప్రతికూలతలు కూడా ఉన్నాయి. బ్యాంక్ అకౌంట్ కలిగిన వారు చార్జీలు భారం కూడా భరించాల్సి ఉంటుంది.
కొన్ని బ్యాంకులు అయితే నిర్ణీత పరిమితి దాటిన తర్వాత డబ్బులు డిపాజిట్ చేయాలని చార్జీలు వసూలు (Online Payments charges in banks) చేస్తున్నాయి. వివిధ బ్యాంకుల్లో చార్జీలు పలు రకాలుగా ఉన్నాయి. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (ఎన్ఈఎఫ్టీ) (National Electronic Funds Transfer (NEFT) ఆప్షన్ దాదాపు అన్ని ప్రధాన బ్యాంకుల్లో సమానంగా ఉన్నాయి. ఈ ఛార్జీలు రూ.2.50 నుంచి రూ.25 వరకు ఉంటాయి. దీంతో పాటు ఆర్టీజీఎస్ చార్జీలు (Real Time Gross Settlement System (RTGS) కొన్ని బ్యాంకులు విధిస్తున్నాయి.
బ్యాంక్ అకౌంట్‌లో మినిమమ్ బ్యాలెన్స్ కలిగి ఉండాలి. లేదంటే బ్యాంకులు చార్జీలు వసూలు చేస్తాయి. మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే రూ.5 నుంచి రూ.15 వరకు ఛార్జీలు పడతాయి. డెబిట్ కార్డు పోతే కొత్త కార్డు పొందటానికి రూ.50 నుంచి రూ.500 వరకు ఛార్జీలు చెల్లించుకోవాలి. చెక్ ద్వారా లావాదేవీలు నిర్వహించే వారు కూడా చార్జీలు చెల్లించుకోవాలి. ఒక చెక్ క్లియర్ చేయడానికి బ్యాంకులు రూ.150 వరకు ఛార్జీలు వసూలు చేస్తాయి. రూ.లక్షకు పైన విలువ ఉన్న చెక్స్‌కి ఈ ఛార్జీలు వర్తిస్తాయి. రూ.లక్ష లోపు అయితే చార్జీలు ఉండవు.
బ్యాంక్ నుంచి మీకు ఏమైనా డాక్యుమెంట్లు కావాలన్నా చార్జీలు చెల్లించాలి. డూప్లికేట్ అకౌంట్ స్టేట్‌మెంట్ పొందాలంటే రూ.50 నుంచి రూ.100 వరకు చార్జీలు చెల్లించాలి. బ్యాంకులు ఎస్ఎంఎస్ చార్జీలను కూడా వసూలు చేస్తాయి. ఐఎంపీఎస్ ద్వారా డబ్బులు పంపాలన్నా చార్జీలు పడతాయి. ఐఎంపీఎస్ ఛార్జీలు రూ.1- రూ.25 మధ్య ఉంటాయి. ఇవే కాకుండా బ్యాంకులు ఇతర ఛార్జీలను కూడా వసూలు చేస్తాయి. అకౌంట్ క్లోజింగ్, చెక్ బుక్, ఔట్ స్టేషన్ చెక్ హ్యాండ్లింగ్, డిమాండ్ డ్రాఫ్ట్, లాకర్ వంటి వాటికి ఛార్జీలు పడతాయి.
ఐసీఐసీఐ బ్యాంక్
ఈ బ్యాంక్ నెలలో ఎనిమిది వరకు ఏటీఎం లావాదేవీలకు ఎలాంటి చార్జీలు వసూలు చేయడం లేదు. వీటిల్లో ఐదు ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎంలో నిర్వహించొచ్చు. మిగతా మూడు ఇతర బ్యాంకుల ఏటీఎంలో వినియోగించుకోవచ్చు. ఈ లిమిట్ దాటిన తర్వాత బ్యాంక్ క్యాష్ ట్రాన్సాక్షన్లకు రూ.20 చార్జీ వసూలు చేస్తోంది. అదే నాన్ ఫైనాన్షియల్ లావాదేవీకి అయితే రూ.8.5 తీసుకుంటోంది.
బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చార్జీలు
రూ.10,000 వరకు రూ.2.50+GST రూ.1,00,000 వరకు రూ.5 +GST రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు రూ.15+GST రూ.2 లక్షలకు పైన రూ.25+GST ఉంటుంది.
యాక్సిస్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంకులో చార్జీలు
రూ.10,000 వరకు రూ.2.50+GST రూ.1,00,000 వరకు రూ.5 +GST రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు రూ.15+GST రూ.2 లక్షలకు పైన రూ.25+GST ఉన్నది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్బీఐ కన్స్యూమర్ యూజర్ NEFT చార్జీలు ఇలా ఉన్నాయి. రూ.10,000 వరకు రూ.2.50+GST రూ.1,00,000 వరకు రూ.5 +GST రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు రూ.15+GST రూ.2 లక్షలకు పైన రూ.25+GST ఉంటుంది.
హెచ్‌డిఎఫ్‌సీ బ్యాంకులో చార్జీలు
రూ.10,000 వరకు రూ.2.50+GST రూ.1,00,000 వరకు రూ.5 +GST రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు రూ.15+GST రూ.2 లక్షలకు పైన రూ.25+GST ఉన్నది.
బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్ర
క్యాష్ విత్‌డ్రాయెల్, డిపాజిట్ లావాదేవీలపై కూడా చార్జీలు విధిస్తోంది. నెలలో తొలి మూడు లావాదేవీలు ఉచితం. ఈ లిమిట్ దాటిన తర్వాత ట్రాన్సాక్షన్‌కు రూ.100 వరకు వసూలు చేస్తోంది.
కోటక్ మహీంద్రా బ్యాంక్
నెలలో 4 క్యాష్ ట్రాన్సాక్షన్లను ఉచితంగా అందిస్తోంది. ఈ లిమిట్ దాటిన తర్వాత డబ్బులు విత్‌డ్రా చేయాలన్నా లేదంటే తీసుకోవాలన్నా చార్జీలు చెల్లించుకోవాలి. రూ.1000కు రూ.3.5 లేదా ట్రాన్సాక్షన్‌కు రూ.150 వరకు చార్జీలు విధిస్తోంది.