New UPI Feature: యూపీఐ ప్లాట్ ఫామ్‌పై అదిరిపోయే ఫీచర్, వస్తువు డెలివరీ అయ్యే దాకా అకౌంట్ నుంచి డబ్బులు బ్లాక్ చేసుకోవచ్చు, సింగిల్ బ్లాక్ మల్టిపుల్ డెబిట్స్ తీసుకువస్తున్న RBI

దీని పేరే సింగిల్ బ్లాక్ మల్టిపుల్ డెబిట్స్ ఫీచర్. దీని (Single-Block-and-Multiple-Debits) ద్వారా మీరు మీ చెల్లింపులు చాలా జాగ్రత్తగా చేసుకోవచ్చు. ఒక మర్చంట్ కు సంబంధించి చేయాల్సిన చెల్లింపులను యూపీఐ ద్వారా బ్లాక్ చేసుకోవచ్చు.

e-RUPI (Photo Credits: Twitter/PBMS_India)

యూపీఐ ప్లాట్ ఫామ్‌పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సరికొత్త ఫీచర్ ను (New UPI Feature) అందబాటులోకి తీసుకురానుంది. దీని పేరే సింగిల్ బ్లాక్ మల్టిపుల్ డెబిట్స్ ఫీచర్. దీని (Single-Block-and-Multiple-Debits) ద్వారా మీరు మీ చెల్లింపులు చాలా జాగ్రత్తగా చేసుకోవచ్చు. ఒక మర్చంట్ కు సంబంధించి చేయాల్సిన చెల్లింపులను యూపీఐ ద్వారా బ్లాక్ చేసుకోవచ్చు.

ఉత్పత్తులు డెలివరీ అయిన తర్వాత అలా బ్లాక్ చేసిన మొత్తం మర్చంట్ కు వెళ్లే విధంగా సెట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ వల్ల వినియోగదారులకు చాలా ప్రయోజనాలున్నాయి. హోటల్ బుకింగ్ లు, సెకండరీ క్యాపిటల్ మార్కెట్లో సెక్యూరిటీల కొనుగోళ్లు, ప్రభుత్వ సెక్యూరిటీల కొనుగోళ్లు, ఈ కామర్స్ లావాదేవీల విషయంలో ఇది సాయంగా ఉంటుందని ఆర్ బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ స్వయంగా వెల్లడించారు.

Meta ఉద్యోగులకు జుకర్ బర్గ్ భారీ షాక్, ఉద్యోగులకు అందించే బెన్ఫిట్స్‌ విషయంలో వెనక్కి తగ్గిన మెటా CEO, 11 వేల మంది ఉద్యోగులను తొలగించిన మార్క్ జుకర్‌బర్గ్

ఉదాహరణకు ఓ కంపెనీ షేర్లు కొనాలని అనుకున్నారు. కావాల్సిన మొత్నాన్ని ముందుగా మీ ట్రేడింగ్ అకౌంట్ కు యాడ్ చేసుకుంటేనే, ఆర్డర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు అనుకున్న రేటుకు షేరు కొనుగోలు ఆర్డర్ కన్ ఫర్మ్ కాలేదని అనుకుందాం. అప్పుడు అనవసరంగా ఆ బ్యాలన్స్ ట్రేడింగ్ ఖాతాలో ఉండి పోతుంది. కొత్త విధానంలో ఈ ఇబ్బంది ఉండదు. ఆ మొత్తం బ్యాంకు ఖాతాలో ఉండి, మన కొనుగోళ్ల ధ్రువీకరణ తర్వాతే డెబిట్ అవుతుంది. ఈ విధానం త్వరలో అమల్లోకి రానుంది.