Meta ఉద్యోగులకు జుకర్ బర్గ్ భారీ షాక్, ఉద్యోగులకు అందించే బెన్ఫిట్స్‌ విషయంలో వెనక్కి తగ్గిన మెటా CEO, 11 వేల మంది ఉద్యోగులను తొలగించిన మార్క్ జుకర్‌బర్గ్
Meta. (Photo credits: Twitter)

మెటా సంస్థ ప్రారంభించిన నాటి నుంచి ఎన్నడూ జరగనంత స్థాయిలో మెటా 11 వేల మంది ఉద్యోగుల్ని ఫైర్‌ చేసింది. ఖర్చులు తగ్గించుకునేందుకు వేరే దారి లేదంటూ మార్క్‌ జుకర్‌ బర్గ్‌ (Mark Zuckerberg) ఉద్యోగులకు ఇంటర్నల్‌ మెయిల్స్‌ పెట్టారు. అలాగే మెటా వ్యవస్థాపకుడు, CEO మార్క్ జుకర్‌బర్గ్ వాగ్దానం చేసినట్లుగా గత నెలలో కంపెనీ నుండి తొలగించబడిన ఎప్పటికైనా Meta ఉద్యోగులు తమకు సెవెరెన్స్ ప్యాకేజీని పొందలేదని పేర్కొన్నారు.11,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను, గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో దాదాపు 13 శాతం మందిని తొలగించారు.

CNBC నివేదిక ప్రకారం, కార్పొరేట్ శిక్షణా కార్యక్రమం ద్వారా మెటాలో చేరిన ఉద్యోగులు "ఇటీవల తొలగించబడిన ఇతర కార్మికులతో పోలిస్తే వారు అత్యంత తక్కువ స్థాయి ప్యాకేజీలను పొందుతున్నారు" అని పేర్కొన్నారు. ఉద్యోగులు మెటా యొక్క సోర్సర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లో సభ్యులు, ఇది కంపెనీ పాత్‌వేస్ ప్రోగ్రామ్‌లో భాగం. Facebook పేరెంట్ మెటా ఈ వారం 'వేల మంది' ఉద్యోగులను తొలగించాలని ప్లాన్ చేస్తోందని నివేదికలు చెబుతున్నాయి.

సెమీ-అర్బన్, రూరల్ స్టోర్‌లలో 650 శాతం పెరిగిన యూపీఐ లావాదేవీలు, వివరాలను వెల్లడించిన PayNearby నివేదిక

ఉద్యోగులకు అందించే బెన్ఫిట్స్‌ విషయంలో వెనక్కి తగ్గినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. సంస్థ 11వేల మందికి పింక్‌ స్లిప్‌ జారీ చేసే సమయంలో మెటాలో ఉపాధి కోల్పోయిన ఉద్యోగులకు 16 వారాల బేస్ సెరారెన్స్ పేతో పాటు ప్రతి సంవత్సరం సర్వీస్‌కు రెండు అదనపు వారాల వేతనాన్ని అందిస్తామని హామీ ఇచ్చింది. దీంతో పాటు ఉద్యోగులకు, వారి కుటుంబాలకు 6 నెలల పాటు హెల్త్‌ ఇన్స్యూరెన్స్‌ ​ అలవెన్స్‌లు వర్తిస్తాయని తెలిపింది.

అయితే తాజాగా మెటా కేవలం 8 వారాల బేస్ పే, మూడు నెలల ఇన్సూరెన్స్ మాత్రమే ఇస్తుందని ఉద్యోగులు చెబుతున్నారు. తాము కాంట్రాక్ట్‌ ఉద్యోగులం కాదని, అయినా తమ పట్ల యాజమాన్యం ఇలా ఎందుకు కఠినంగా వ్యవహరిస్తుందో అర్ధం కావడం లేదని వాపోతున్నారు. ఫైర్‌ చేసిన ఉద్యోగుల్లో కొంతమందికి మాత్రమే జుకర్‌ బర్గ్‌ హామీ ఇచ్చినట్లు బెన్ఫిట్స్‌ అందిస్తున్నారని, మిగిలిన ఉద్యోగుల విషయంలో వ్యత్యాసం చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్లే స్టోర్లలో చెలామణిలో 300 లోన్ యాప్‌లు, వినియోగదారులను టార్గెట్ చేయడమే వీరి లక్ష్యం, కొత్త నివేదికలో వెల్లడి

కాగా, ఉద్యోగం కోల్పోయి తక్కువ సెవరన్సు పే పొందిన ఉద్యోగుల గురించి సమాచారం కావాలని మెటా సీఈవో మార్క్ జుకర్‌ బర్గ్‌ ఇతర ఎగ్జిక్యూటీవ్‌లకు లేఖ పంపారని, సమస్యను పరిష్కరించాలని కోరినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.