Paytm NPCI Approval: పేటీఎంకు బిగ్ రిలీఫ్ ఇచ్చిన ఎన్పీసీఐ, యూపీఐ లావాదేవీలు నిర్వహించేందుకు వన్97 కమ్యూనికేషన్స్ సంస్థకు అనుమతి

పేటీఎం (Paytm) మాతృ సంస్థ వన్‌ 97 కమ్యూనికేషన్స్‌కు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (NPCI) థర్డ్‌ పార్టీ అప్లికేషన్‌ ప్రొవైడర్‌ (TPAP) లైసెన్స్‌ను గురువారం మంజూరు చేసింది.దీని ప్రకారం మల్టీ బ్యాంక్‌ మోడల్‌ కింద ఇకపై పేటీఎం బ్రాండ్‌పైనా యూపీఐ సేవలందిస్తుంది.

Fintech Firm Gets Approval From NPCI To Participate in UPI Under Multi-Bank Model

పేటీఎం (Paytm) మాతృ సంస్థ వన్‌ 97 కమ్యూనికేషన్స్‌కు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (NPCI) థర్డ్‌ పార్టీ అప్లికేషన్‌ ప్రొవైడర్‌ (TPAP) లైసెన్స్‌ను గురువారం మంజూరు చేసింది.దీని ప్రకారం మల్టీ బ్యాంక్‌ మోడల్‌ కింద ఇకపై పేటీఎం బ్రాండ్‌పైనా యూపీఐ సేవలందిస్తుంది.పేటీఎం బ్రాండ్ కింద వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ పేమెంట్ సర్వీస్ అందిస్తుంది. నిరంతరాయంగా పేటీఎం హ్యాండిల్స్ పని చేస్తాయి.పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌పై ఆంక్షల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. పేటీఎంలో మొదలైన ఉద్యోగాల కోతలు, 20 శాతం మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న వన్ 97 కమ్యూనికేషన్స్

యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, యస్‌ బ్యాంక్‌లు ఇకపై పేటీఎంకు పేమెంట్‌ సిస్టమ్‌ ప్రొవైడర్‌ బ్యాంక్స్‌గా వ్యవహరిస్తాయి. ప్రస్తుతం ఉన్న యూజర్లు, మర్చంట్లు తమ యూపీఐ లావాదేవీలు, ఆటో పే మ్యాండెట్లను ఎలాంటి అవాంతరం లేకుండా వినియోగించుకోవడానికి ఈ నిర్ణయం వీలు పడుతుందని ఎన్‌పీసీఐ తెలిపింది. పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ ఖాతాదారులు, మర్చంట్స్‌ మార్చి 15లోగా తమ అకౌంట్లను వేరే బ్యాంకులకు మార్చుకోవాలని ఆర్‌బీఐ సూచించిన నేపథ్యంలో ఎన్‌పీసీఐ నుంచి ఈ నిర్ణయం వెలువడింది.