UPI Payments: యూజర్లకు ఫోన్ పే శుభవార్త, విదేశాలకు కూడా మీ ఫోన్ పే నుండి యూపీఐ లావాదేవీలు జరుపుకోవచ్చు, కొత్త ఫీచర్ లాంచ్ చేసిన PhonePe
తమ వినియోగదారులు యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ సిస్టమ్‌ను ఉపయోగించి యుఎఇ, నేపాల్, సింగపూర్‌తో సహా ఐదు దేశాల్లోని అంతర్జాతీయ మర్చంట్ అవుట్‌లెట్‌లకు ఇప్పుడు చెల్లించగలరని ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పే మంగళవారం తెలిపింది
యూజర్లకు ఫోన్ పే శుభవార్తను అందించింది. తమ వినియోగదారులు యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ సిస్టమ్‌ను ఉపయోగించి యుఎఇ, నేపాల్, సింగపూర్‌తో సహా ఐదు దేశాల్లోని అంతర్జాతీయ మర్చంట్ అవుట్‌లెట్‌లకు ఇప్పుడు చెల్లించగలరని ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పే మంగళవారం తెలిపింది.Phonepe వినియోగదారులు తమ ఇండియన్ బ్యాంక్ నుండి నేరుగా విదేశీ కరెన్సీలో చెల్లింపులు చేయగలరు. ఈ ఫీచర్ ద్వారా వారు అంతర్జాతీయ డెబిట్ కార్డ్‌లతో లావాదేవీలు చేసినట్లేనని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రస్తుత లాంచ్ UAE, సింగపూర్, మారిషస్, నేపాల్, భూటాన్‌లలో స్థానిక QR కోడ్‌ను కలిగి ఉన్న అన్ని అంతర్జాతీయ వ్యాపారి అవుట్‌లెట్‌లకు మద్దతు ఇస్తుందని తెలిపింది. భారతదేశంలో ఈ ఫీచర్‌ను ప్రారంభించిన మొదటి ఫిన్‌టెక్ యాప్ PhonePe అని ప్రకటనలో పేర్కొంది.కంపెనీకి 43.5 కోట్ల మంది రిజిస్టర్డ్ యూజర్లు ఉన్నారు.
సాధారణంగా భారతీయ కస్టమర్‌లు అంతర్జాతీయ మర్చంట్ అవుట్‌లెట్‌లలో చెల్లించడానికి విదేశీ కరెన్సీని లేదా వారి క్రెడిట్ లేదా ఫారెక్స్ కార్డ్‌లను ఉపయోగించాలి. అయితే తాజాగా వచ్చిన 'UPI ఇంటర్నేషనల్' చెల్లింపుల ఫీచర్‌తో, PhonePe ఇప్పుడు UPIని ఉపయోగించి చెల్లించడానికి వారి ఇండియన్ బ్యాంక్ ఖాతాలను ఉపయోగించవచ్చు.
“UPI ఇంటర్నేషనల్ అనేది ప్రపంచంలోని ఇతర వ్యక్తులకు కూడా UPI లావాదేవీలు చేయడంలో మొదటి ప్రధాన అడుగు. ఈ ప్రయోగం గేమ్‌ఛేంజర్‌గా నిరూపిస్తుందని, విదేశాలకు వెళ్లే భారతీయులు విదేశాల్లోని వ్యాపారి అవుట్‌లెట్‌లలో చెల్లించే విధానాన్ని పూర్తిగా మారుస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను" అని PhonePe CTO, సహ వ్యవస్థాపకుడు రాహుల్ చారి అన్నారు.
ఈ సంవత్సరం కాలంలో, NPCI NIPL (NPCI ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్) సహకారంతో UPI ఇంటర్నేషనల్‌ను మరిన్ని దేశాలకు అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది, అదే సమయంలో ఈ ఫీచర్ ప్రస్తుతం లైవ్‌లో ఉన్న ప్రాంతాలలో ఎక్కువ వ్యాపారుల ఆమోదాన్ని కూడా అనుమతిస్తుంది.