YouTube Offline Videos: యూజర్లకు యూట్యూబ్ షాక్, ఆఫ్‌లైన్ వీడియోలకు ఇకపై డబ్బు కట్టాల్సిందే! ప్రీమియం సబ్‌స్క్రైబర్లను పెంచేందుకు యూట్యూబ్ సరికొత్త ఎత్తుగడ
ఇక నుంచి యూట్యూబ్ వీడియోలను ఆఫ్‌లైన్(YouTube offline Videos)లో ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోలేరు. మునుపటిలా హై(High Quality), ఫుల్ హెచ్‌డీ క్వాలిటీ(FHD Videos) వీడియోలను ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవడం కుదరదు.
New Delhi December 30: యూట్యూబ్ (YouTube)యూజర్లకు షాకింగ్ న్యూస్. ఇక నుంచి యూట్యూబ్ వీడియోలను ఆఫ్‌లైన్(YouTube offline Videos)లో ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోలేరు. మునుపటిలా హై(High Quality), ఫుల్ హెచ్‌డీ క్వాలిటీ(FHD Videos) వీడియోలను ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవడం కుదరదు. ఒకవేళ మీరు అలా డౌన్ లోడ్ చేసుకోవాలంటే యూట్యూబ్ ప్రీమియం(YouTube premium) సబ్ స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే యాడ్ ఫ్రీ కంటెంట్ కోసం యూట్యూబ్ ప్రీమియంను ప్రవేశపెట్టగా... తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.
యూట్యూబ్ వీడియోలను తరచూ చూసేవారు ఆఫ్‌లైన్ డౌన్‌లోడ్ ఆప్షన్‌ను ఎక్కువగా ఉపయోగిస్తారు. డేటా వేగంలో(Data) ఇబ్బందులున్నవారు, తమకు కావాల్సిన వీడియోలను ఆఫ్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకుంటారు. తర్వాత నచ్చినప్పుడు చూసుకుంటారు. ఇందులో రెండు ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి ఇంటర్నెట్ వేగంతో సంబంధం లేదు కాబట్టి వీడియో బఫర్(Video Buffer) అవుతుందన్న బాధ లేదు. పైగా ఎన్నిసార్లయినా చూసుకోవచ్చు. రెండోది ఆఫ్‌లైన్ వీడియోలకు ప్రకటనలు రావు(No Add). కానీ ఇప్పుడు యూట్యూబ్ తీసుకున్న నిర్ణయం నిజంగా యూజర్లు షాక్ అనే చెప్పాలి.
ఇప్పటి వరకు లో, మీడియం, హై, ఫుల్ హెచ్‌డీ క్వాలిటీ.. ఇలా ఎలాంటి క్వాలిటీ వీడియో అయినా ఉచితంగా ఆఫ్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు ఉంది. యూట్యూబ్ తీసుకున్న తాజా నిర్ణయంతో లో, మీడియం క్వాలిటీ వీడియోలను మాత్రమే ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునే వీలు ఉంది. యూట్యూబ్ తాజా నిర్ణయం పట్ల నెటిజన్లు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా పోస్టులు పెడుతున్నారు.